నందమూరి కుటుంబంలో పెళ్లి వేడుక జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ పెళ్లి నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడైన జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లి చేసుకోవడం జరిగింది. రేఖావాణి అనే యువతి మెడలో చైతన్య కృష్ణ మూడుముళ్లు వేశారు. బాలకృష్ణ కుటుంబంతో పాటు ఈ పెళ్ళికి హాజరయ్యారు. కుమారుడు కోడలిని ఆయన ఆశీర్వదించారు. 

అలాగే హీరో కళ్యాణ్ రామ్ కూడా సతీ సమేతంగా హాజరు కావడం జరిగింది. 
నందమూరి కుటుంబం మొత్తం ఈ వేడుకలో కనిపించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ పెళ్ళికి హాజరుకాలేదని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ పెళ్ళికి హాజరు కాలేకపోయారట. దీనితో వేడుకలో ఎన్టీఆర్ కనిపించలేదు. బాలయ్య, కళ్యాణ్ రామ్ లతో పాటు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ వేడుకలో అగుపించారు. 

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఎంత ఒత్తిడి పెట్టినా మోక్షజ్ఞ ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతుంది. బాలయ్య మాత్రం 2021 లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.