దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది లతా మంగేష్కర్ అభిమానులకు ఇది శుభవార్త. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కోవిడ్ ని జయించారు. కొన్నిరోజుల లతా మంగేష్కర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.
దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది లతా మంగేష్కర్ అభిమానులకు ఇది శుభవార్త. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కోవిడ్ ని జయించారు. కొన్నిరోజుల లతా మంగేష్కర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో ఆమెని కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ప్పటి నుంచి వైద్యులు ఆమెని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ అందింది. స్వయంగా మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోపే లతా మంగేష్కర్ తాజా ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. ఆసుపత్రి వైద్యుల నుంచి లతా మంగేష్కర్ హెల్త్ వివరాలని అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాజేష్ మాట్లాడుతూ.. 'నేను లతా మంగేష్కర్ గారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతిత్ తో మాట్లాడాను.
లతా మంగేష్కర్ గారు కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే న్యుమోనియా నుంచి కూడా ఆమె కోలుకున్నారు. వెంటిలేటర్ పై నుంచి కూడా ఆమెని తొలగించినట్లు పేర్కొన్నారు. వైద్యానికి ఆమె చాలా బాగా స్పందిస్తున్నారని, ఇంకొన్ని రోజులు ఐసీయూలోనే కొనసాగుతారని పేర్కొన్నారు.
తన మధురమైన గాత్రంతో లతా మంగేష్కర్ తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకున్నారు. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అలాంటి లతా మంగేష్కర్ కోవిడ్ కి గురయ్యారని వార్త రావడంతో అభిమానులంతా కంగారు పడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిసి అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 8 నుంచి లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
