బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆదివారం గేమ్‌లో అరియానా, లాస్యలకు మధ్య ఎలిమినేషన్‌ పోటీ జరగ్గా చివరకు లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. అంతకు ముందే ఓ ఆడియెన్‌ ఆమెతో ఫోన్‌లో మాట్లాడి, మిగిలిన వారంతా తమ రియాలిటీ ఏంటో చూపిస్తున్నారు. కానీ లాస్య మాత్రం సేఫ్‌ గేమ్‌ అవుతుందని, తన రియాలిటీని చూపించడం లేదని తెలిపింది. 

అప్పుడే లాస్యకి ఎలిమినేషన్‌ హెచ్చరికలు వచ్చేశాయి. అందరు ఊహించినట్టే, అందరు అనుకున్నట్టుగానే పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. అయితే మెహబూబ్‌ వెళ్లినప్పుడు ఇంటి సభ్యులంతా చాలా ఎమోషనల్‌ అయ్యారు. కానీ లాస్య విషయంలో అలా జరగలేదు. అంటే సభ్యులతో తన అటాచ్‌మెంట్‌ అంతేనా అనేది తేలిపోయింది. 

లాస్య వెళ్లేముందు టాప్‌ 2 ఎవరో చెప్పేసింది. నాగార్జున ఈ విషయాన్ని అడగ్గా, అభిజిత్‌, సోహైల్‌ టాప్‌ 2 అని, వారిద్దరి మధ్య టైటిల్‌ పోరు ఉంటుందని చెప్పేసింది. ఆ తర్వాత హారికకి పరోక్షంగా మూడో స్థానాన్ని ఇచ్చింది. ఆమె విషయంలో మరోసారి లాస్య సేఫ్‌ గేమ్‌ ఆడింది. ఎలిమినేట్‌ అయిన తాను తన జున్ను వద్దకు వెళ్తున్నానని, ఏం బాధపడటం లేదని తెలిపింది లాస్య. 

ఇంటిసభ్యుల గురించి మాట్లాడుతూ పలు నిజాలను వెళ్లడించింది. అవినాష్‌ గురించి చెబుతూ, అవినాష్‌ మంచి ఎంటర్‌టైనర్‌ అని, ఆయనకు అందరిని నవ్విస్తాడని తెలిపింది. అయితే నామినేషన్‌లో మాత్రం తనపై ఏ మాట అన్న రిసీవ్‌ చేసుకోలేడని, ఫీల్‌ అవుతాడని తెలిపింది. నువ్వు నామినేట్‌ చేసినప్పుడు ఏదైతే రీజన్‌ చెబుతావో, నీ విషయంలోనూ అలానే తీసుకోవాలని తెలిపింది. అది తప్పితే అవినాష్‌ చాలా బాగా ఆడుతున్నాడని తెలిపింది. 

మోనాల్‌ గురుంచి చెబుతూ, ఈ మధ్య గేమ్‌ బాగా ఆడుతుందని, కొన్ని సార్లు కన్‌ఫ్యూజన్‌ అవుతుందని, లాంగ్వేజ్‌తో వచ్చే కన్‌ఫ్యూజనా? లే ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఉంటుందో తెలియదుగానీ చాలా సార్లు కన్‌ఫ్యూజ్‌ అవుతుంటుందని చెప్పింది లాస్య. అరియానా గురించి చెబుతూ, ఆమె ఓ సారి తనని నామినేట్‌ చేయడానికి దెబ్బలు తగిలించుకుని మరీ వచ్చిన విధానం బాగా నచ్చిందని చెప్పింది. బోల్డ్ గా మాట్లాడుతుందని, కొన్ని సార్లు అది శృతి మించుతుందని చెప్పింది. 

సోహైల్‌ తనకు తమ్ముడి లాంటివాడని, కోపం అంతలోనే వచ్చి  నరాలు తెగిపోయేలా ఉంటారని ప్రవర్తిస్తాడని, అంతలోనే కోపం పోతుందని చెప్పింది. కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని, గేమ్‌ చాలా బాగా ఆడుతుండని పేర్కొంది. అఖిల్‌ .. గేమ్‌ బాగా ఆడుతున్నాడని, కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నాడు వినడం లేదని, ఊరికే అగ్రెసివ్‌ అయిపోతాడని, అది తగ్గించుకోవాలని చెప్పింది. 

అభిజిత్‌ గురించి చెబుతూ, అభిజిత్‌ బాగా ఆడుతుండని, అతనంటే ఇష్టమని తెలిపింది. అందరిని సమానంగా చూస్తాడని, ఎక్కువగా హాట్‌ వాటర్‌ తాగుతూ చిల్‌ అవుతుంటాడని పేర్కొంది. హారిక తనకిష్టమైన అమ్మాయి అని, అల్లరి పిల్ల అని, గట్టిదని, కింద పడినా గట్టిగా లేవాలని ప్రయత్నిస్తుంది. ఏదైనా సాధించేంత వరకు వదలదని పేర్కొంది. ఇలా ఒక్కొక్కరి బండారాలు బయటపెట్టింది లాస్య.