Asianet News TeluguAsianet News Telugu

రజనీ కనపడేది ...అంత తక్కువసేపా?,షాక్ లో డిస్ట్రిబ్యూటర్స్

‘‘లాల్‌ సలాం’ చిత్రంలో ముంబై డాన్‌  మొయిద్దీన్‌  భాయ్‌ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్‌. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

Lal Salaam, Rajanikanth features in an extended cameo appearance jsp
Author
First Published Nov 23, 2023, 6:38 AM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయనతో  సినిమా అంటే ఇప్పుడు అభిమానులు  మినిమం ఎక్సపెక్ట్ చేస్తారు. అయితే సంక్రాంతికి రాబోయే ‘లాల్‌ సలాం’సినిమాలో రజనీ కనపడేది కేవలం అరగంటే అని తెలిసింది.  విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా రజనీకాంత్, కపిల్‌ దేవ్, జీవితా రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మించారు. ‘‘లాల్‌ సలాం’ చిత్రంలో ముంబై డాన్‌  మొయిద్దీన్‌  భాయ్‌ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్‌. 

రజినీకాంత్  కేవలం అరగంట పాటు ఉండే పాత్రలో కనిపిస్తాడని తమిళ సినీ వర్గాల సమాచారం. ఇంకా తక్కువే ఉంటుందేమో కానీ అంతకు మించి ఉండదు ఆయన పాత్ర అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు  ప్రస్తుతం రజనీకు ఉన్న క్రేజ్ తో  ప్రీ రిలీజ్ బిజినెస్ జరుతోంది. అయితే సినిమాలో ఆయన కనపడేది అరగంటే అంటే అది రజనీ చిత్రం ఎలా అవుతుందని, అంతంత రేట్లు చెప్తే ఎలా అని  డిస్ట్రిబ్యూటర్స్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

 అదే సమయంలో ఈ సినిమాకు పోటీగా ...తన చిత్రం “కెప్టెన్ మిల్లర్” కూడా సంక్రాంతికి విడుదల కానుంది అని హీరో ధనుష్ ప్రకటించాడు.  ఇవే  కాకుండా తెలుగులో నాలుగు, ఐదు చిత్రాలు సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. దాంతో, “లాల్ సలాం” కేవలం తమిళంలోనే పొంగల్ కి వస్తుందేమో,మిగతా భాషల్లో వేరే డేట్ కి ఫిక్స్ చేస్తారేమో అనుకున్నారు. అయితే  ఈ వార్తలకు చెక్ పెట్టింది  నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. పొంగల్ కి విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని తాజాగా లైకా సంస్థ పోస్ట్ చేసింది. “లాల్ సలాం” చిత్రానికి దర్శకురాలు ఐశ్వర్య. ఆమె రజినీకాంత్ పెద్ద కూతురు, ధనుష్ మాజీ భార్య.  

Follow Us:
Download App:
  • android
  • ios