Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ఆడియో రైట్స్ ఎంతకు అమ్మారో తెలిస్తే షాకే

''రాజమౌళి రూపొందిస్తున్న భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా 'RRR' మ్యూజిక్ రైట్స్ పొందడం ఆనందంగా ఉంది'' అని టీ-సిరీస్ మరియు లహరి మ్యూజిక్ సంస్థలు తెలిపాయి.

Lahari T Series bag RRR music rights for 25 Cr jsp
Author
Hyderabad, First Published Jul 27, 2021, 7:30 AM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బాలీవుడ్‌ తారలు అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఆ పాటల్ని పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది చిత్రటీమ్. దసరా సందర్భంగా అక్టోబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో రైట్స్  అమ్మకం జరిగింది. 

 ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను బాహుబలి ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న లహరి మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ని ఆడియో రైట్స్ ని ఈ సంస్థ కొంతం చేసుకోగా… హిందీ రైట్ మాత్రం భూషణ్ కుమార్ కు చెందిన టీ-సిరీస్  సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు రెండు సంస్దలు కలిసి 25 కోట్లు చెల్లించినట్లు సమచారం.

''రాజమౌళి రూపొందిస్తున్న భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా 'RRR' మ్యూజిక్ రైట్స్ పొందడం ఆనందంగా ఉంది'' అని టీ-సిరీస్ మరియు లహరి మ్యూజిక్ సంస్థలు తెలిపాయి.భూషణ్ కుమార్ మాట్లాడుతూ ''మాకు రాజమౌళి - కీరవాణి కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టం. వారి వర్క్ ని మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాం. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘RRR’ సినిమా మ్యూజిక్ రైట్స్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాటలు మరియు సినిమా అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాము'' అని అన్నారు. 

ఇక సినిమాకు సంబంధించిన మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అముడు పోయిన సంగతి తెల్సిందే.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ చేస్తున్న ఓ పాటలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అలియాభట్‌లతో కలిసి రాజమౌళి కాలు కదుపుతున్నారు. ప్రేమ్‌రక్షిత్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్న ఆ పాట చిత్రీకరణ మరో రెండు రోజులపాటు సాగుతుంది. అనంతరం ఉక్రెయిన్‌లో ఓ పాటని తెరకెక్కించనున్నారు. దాంతో షూటింగ్ పూర్తవనున్నట్టు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios