బన్నీ అతడి చేతులు కట్టేశాడా..?

lagadapati sridhar restricted by allu arjun
Highlights

అల్లు అర్జున్ హీరోగా రీసెంట్ గా 'నా పేరు సూర్య' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే

అల్లు అర్జున్ హీరోగా రీసెంట్ గా 'నా పేరు సూర్య' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అంచనాలను సినిమా అందుకోలేకపోయిందనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని నిర్మాత లగడపాటి శ్రీధర్ సన్నిహితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన సినిమాలకు రిజల్ట్ తో సంబంధం లేకుండా లగడపాటి శ్రీధర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాడు. పబ్లిసిటీ విషయంలో సరికొత్త ప్లాన్స్ ఫాలో అవుతూ సినిమా చూడాలనే ఆసక్తి కలిగిస్తుంటాడు. అతడి మొదటి సినిమా 'ఎవడి గోల వాడిదే'కి కూడా మొదట నెగెటివ్ టాక్ వస్తే తనదైన స్టైల్ లో పబ్లిసిటీ చేసి సినిమాకు పాజిటివ్ టాక్ తెప్పించాడు. అలాంటిది 'నా పేరు సూర్య' విషయంలో అతడు నిర్మాత అయినా.. ఎక్కడా ఇన్వాల్వ్ చేయకుండా అల్లు ఫ్యామిలీ అతడి చేతులు కట్టేసిందని లగడపాటి శ్రీధర్ సన్నిహితులు చెబుతున్నారు.

పైగా ఆ సినిమాకు పోటీగా విడుదలైన 'మహానటి' సినిమా టీమ్ కు ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం లగడపాటి తట్టుకోలేకపోతున్నాడట. ఒక్క ఆడియో ఫంక్షన్, థాంక్స్ మీట్ మినహాయించి బన్నీ కూడా సినిమాను సరైన రీతిలో ప్రమోట్ చేయలేదని అంటున్నారు. 

loader