Asianet News TeluguAsianet News Telugu

లేడి సూపర్ స్టార్స్ ఒకేచోట ఎందుకు కలిశారో తెలుసా.?

  • సెలబ్రిటీ కల్చర్ లో ఇలాంటి గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి
  • అందరూ కలిసి ఫోటోలు దిగడం కచ్చితంగా అట్రాక్షన్ అవుతుంది​
  • రీసెంట్ గా ఇలాంటిదే సూపర్బ్ అనిపించే ఓ సంఘటన జరిగింది​
Lady super stars at nara devansh birthday party

సెలబ్రిటీ కల్చర్ లో ఇలాంటి గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి కానీ.. ఒకే చోట ఎక్కువ మంది కనిపించడం.. అందరూ కలిసి ఫోటోలు దిగడం కచ్చితంగా అట్రాక్షన్ అవుతుంది. రీసెంట్ గా ఇలాంటిదే సూపర్బ్ అనిపించే ఓ సంఘటన జరిగింది.

నారా లోకేష్- బ్రాహ్మణిల కుమారుడు  దేవాన్ష్ మూడవ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలే వచ్చారు. రామ్ చరణ్ భార్య ఉపాసన.. మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న.. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ లతో పాటు నారా బ్రాహ్మణి కలిసి దిగిన ఫోటో ఒకటి.. ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంత మంది సెలబ్రిటీ లేడీస్ ఒక చోట కనిపించడం అపూర్వం అనిపించేసింది. అందరూ తమ తమ ట్రెండ్స్ కు తగినట్లుగా డ్రెసింగ్ చేసుకుని కనిపించారు. ఒక్కోరిదీ ఒక్కో విభిన్న శైలి. అయినా.. అందరూ సెలబ్రిటీలే. 

మహేష్ కూతురు సితారతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన.. ఈ సూపర్ లేడీస్ పిక్ ను కూడా తనే షేర్ చేసింది. నారా దేవాన్ష్ కు ఆశీర్వాదాలు అందంచిన తర్వాత.. అందరూ కలిసి బోలెడంత సేపు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడప్పుడు మాత్రమే తీరిక సమయాన్ని చక్కగా ఉపయోగిచుకుంటూ తీరిగ్గా ముచ్చట్లు ఆడుకున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios