`ఖుషి` అంటూ సాంగే టైటిల్ సాంగ్‌ని శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ల మధ్య వచ్చే మరో అందమైన మెలోడీ సాంగ్ ఇది.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం `ఖుషి`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తుంది యూనిట్. బ్యూటీఫుల్ మెలోడీస్ ఆకట్టుకుంటున్నాయి. వినసొంపుగా ఉంటున్నాయి. ఫ్యాన్స్ నే కాదు, శ్రోతలను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యూటీఫుల్ మెలోడీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సాంగ్ వచ్చింది.
`ఖుషి` అంటూ సాంగే టైటిల్ సాంగ్‌ని శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, సమంత ల మధ్య వచ్చే మరో అందమైన మెలోడీ సాంగ్ ఇది. వారిద్దరి మధ్య ప్రేమని మరింత పెంచేలా, ప్రేమని వ్యక్తం చేసేలా ఉన్న ఈ పాట ఆద్యంతం ఆట్టుకుంటుంది. చాలా అందంగా ఉండటమే కాదు, విజువల్ ట్రీట్‌లా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా డిజైన్ చేశారు. విజయ్, సమంతల కాస్ట్యూమ్స్ నుంచి, షూటింగ్ లొకేషన్ల వరకు బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ఇది సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ పాటని దర్శకుడు శివ నిర్వాణ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఆయనే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. దీంతో ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మొదటి పాట `నా రోజా నువ్వే` ఇప్పటి వంద మిలియన్‌వ్యూస్ క్రాస్ చేసింది. రెండో పాట `ఆరాధ్య` సైతం అలరిస్తుంది. ఇక మూడో పాట కూడా అద్భుతంగా ఉండటంతో `ఖుషి` ఒక మ్యూజిక్ హిట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

ఏ సినిమా అయినా పాటలు హిట్ అయ్యాయంటే సగం సినిమా హిట్ అన్నట్టే, దీంతో `ఖుషి` సక్సెస్ గ్యారంటీ అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నీ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా తరహాలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
సాహిత్యం : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.
