Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ మాజీ లవర్ తో నాకు ఎఫైర్ లేదు..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే కొన్నేళ్ల క్రితం ఆయనతో విడిపోయింది. సుశాంత్ తో విడిపోయిన తరువాత అంకిత ఆయన మిత్రుడు కుశాల్ తో ప్రేమలో పడిందన్న న్యూస్ బాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. 

kushal tandon denies that he has an affair with ankitha lokhande
Author
Hyderabad, First Published Aug 28, 2020, 1:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు దేశంలో ఓ బర్నింగ్ టాప్ గా ఉంది. సుశాంత్ మరణం వెనుక మిస్టరీ తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న విచారణ బృందం పలువురిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. కాగా సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే పై ఓ రూమర్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

అంకిత లోఖండే సుశాంత్ రాజ్ పుత్ తో 2016లో విడిపోయారు. సుశాంత్ తో విడిపోయిన తరువాత అంకిత యువ నటుడు కుశాల్ టాండన్ తో రిలేషన్ నడిపిందని ఓ ప్రముఖ ఛానెల్ లో కథనం రావడం జరిగింది. సుశాంత్ మరియు అంకితల కామన్ ఫ్రెండ్ అయిన కుషాల్ టాండన్ వారిద్దరూ విడిపోయాక అంకితకు దగ్గరయ్యారట. ఇదే విషయాన్ని సదరు పత్రిక ప్రచురించడం జరిగింది. 

ఐతే ఈ విషయంపై నటుడు కుషాల్ టాండన్ ఫైర్ అయ్యారు. నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ఆవేదన చెందారు. సుశాంత్ నాకు సోదర సమానుడన్న కుషాల్, అంకిత నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. మీ విషప్రచారంలో నన్ను కూడా చేర్చకండి, ఇదేం జర్నలిజం అని కుషాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios