తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కేటీఆర్ కి బర్త్ డే విషెష్ తెలిపారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆదివారం జరిగాయి. ప్రస్తుతం కేటీఆర్ కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులందరికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కేటీఆర్ కి బర్త్ డే విషెష్ తెలిపారు. తిరిగి స్పందిస్తూ రాంచరణ్ ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తనకి బర్త్ డే విషెష్ తెలిపిన చరణ్ కి కేటీఆర్ 'థాంక్యూ బ్రదర్' అని రిప్లై ఇచ్చారు. ఇంకా కేటీఆర్ కామెంట్స్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నీ పెర్ఫామెన్స్ గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నా. త్వరలోనే మూవీ చూస్తా అని కేటీఆర్ తెలిపారు. దీనితో చరణ్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
ఎన్టీఆర్, రాంచరణ్ కలసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలో ఇద్దరూ నటించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్ గా లోపల దేశభక్తితో మానసిక సంఘర్షణకి గురయ్యే పాత్రలో చరణ్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్ నటన కూడా అద్భుతం.
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిలో సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా చూశాక కేటీఆర్ ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. రాంచరణ్, కేటీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాంచరణ్ ధృవ, వినయ విధేయ రామ చిత్రాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
