ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని సరసన హీరోయిన్‌గా `ఉప్పెన` సెన్సేషన్‌ కృతి శెట్టి ఎంపికైంది. రామ్‌ ఇటీవల `రెడ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు ఎన్‌.లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్‌ సరసన హీరోయిన్‌గా కృతి శెట్టిని ఫైనల్‌ చేశారు.

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని సరసన హీరోయిన్‌గా `ఉప్పెన` సెన్సేషన్‌ కృతి శెట్టి ఎంపికైంది. రామ్‌ ఇటీవల `రెడ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు ఎన్‌.లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో రామ్‌ సరసన హీరోయిన్‌గా కృతి శెట్టిని ఫైనల్‌ చేశారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 

Scroll to load tweet…

రామ్‌కిది 19వ సినిమా కావడం విశేషం. ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. స్టయిలీష్‌ ఎలిమెంట్స్ తో అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో సినిమాని తీయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. త్వరలో చిత్రంలో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడించనున్నారు. దర్శకుడు లింగుస్వామి `ఆవారా`, `పందెంకోడి` చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఇటీవల ప్రారంభం కాగా, త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని జరుపుకోబోతుంది.

`ఉప్పెన` చిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి ప్రస్తుతం వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇప్పటికే `శ్యామ్‌ సింగరాయ్‌`లో నానితో, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`లో సుధీర్‌బాబుతో కలిసి నటిస్తుంది.