1970 కాలాన్ని చూపిస్తానంటున్న కృష్ణంరాజు. అందుకు జులై 30 వరకు వెయిట్‌ చేయండని తెలిపారు. అంతేకాదు ప్రభాస్‌తో దిగిన ఓ అదిరిపోయే ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) సంయుక్తంగా ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తెలుగు, హిందీతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. జులై 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రేమికుల రోజు విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 1970లో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని టాక్‌. 

అయితే తాజాగా ఈసినిమాని ఉద్దేశించి కృష్ణంరాజు ఓ ఫోటోని పంచుకున్నారు. `70ల నాటి కాలాన్ని మరోసారి చూసొద్దాం.  జూలై 30న ఈ సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం` అని క్యాప్షన్‌  చేశారు. ఈ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ లో ప్రభాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారాయన. ప్రస్తుతం ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్.. విక్రమాదిత్యగా కనిపించబోతున్నారు. అలాగే మ్యూజిక్‌ టీచర్‌ ప్రేరణగా పూజా హెగ్డే నటిస్తున్నారు.