టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. బాహుబలి సినిమా సమయంలో పెళ్లి టాపిక్ వస్తే సినిమా పూర్తయిన తరువాత చేసుకుంటానని చెప్పాడు కానీ ఆ సినిమా పూర్తయి సూపర్ హిట్ అయి ప్రభాస్ మరో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లిపోయాడు కానీ పెళ్లి ఊసెత్తడం లేదు.
అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నలు అతడి పెదనాన్న కృష్ణంరాజుకి ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయనకు మరోసారి ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. 'ఇంతకముందు వరకు బాహుబలి సినిమా పూర్తయిన తరువాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ అనేవాడు.
ఇప్పుడు 'సాహో' సినిమాతో బిజీ అయిపోయాడు. ఆ సినిమా అయ్యాక చూద్దాం అంటున్నాడు' అని కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. అయితే వీలైనంత తొందరగా ప్రభాస్ పెళ్లి జరిపించాలని ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. వచ్చే ఏడాది 'సాహో' విడుదల కానుంది. అప్పుడైనా చేసుకుంటాడో.. లేక రాధాకృష్ణతో సినిమా ఉందని ఆ తరువాత చూద్దామని అంటాడో చూడాలి!
