Asianet News TeluguAsianet News Telugu

‘కృష్ణ వ్రింద విహారి' ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ ఫామ్..

డైరెక్టర్ అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా రూపొందించిన ఈ సినిమాకు డివైడ్ టాక్  లభించింది.  ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ మూవీలో ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. 

Krishna Vrinda Vihari OTT release date and streaming platform
Author
First Published Oct 12, 2022, 5:54 PM IST


 నాగ శౌర్య హీరోగా రీసెంట్ గా థియేటర్ లో దిగిన  'కృష్ణ వ్రింద విహారి’ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వటంలో మాత్రం తడబడింది. కానీ అక్కడక్కడా బాగానే నవ్వించింది. డైరెక్టర్ అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా రూపొందించిన ఈ సినిమాకు డివైడ్ టాక్  లభించింది.  ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ మూవీలో ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం.

 చిత్రం కథేమిటంటే.... కృష్ణాచారి (నాగశౌర్య) తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్)...ఓ రాజమాత టైప్. ఆవిడ మాట అంటే ఆ అగ్రహారంలో నే కాదు..ఆ ఇంట్లోనూ వేదవాక్కే. ఆమె కొంగుచాటున పెరిగిన కృష్ణ...సాప్ట్ వేర్ ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. అక్కడ ప్రాజెక్టు లీడర్ గా చేస్తున్న నార్త్ అమ్మాయి  వ్రింద శర్మ (షిర్లే సేతియా)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు మెడికల్ గా ఓ సమస్య ఉంటుంది. దాంతో అతన్ని దూరం పెడుతుంది. అయితే ఆ సమస్య ఓ రోజు మన కృష్ణ కనుక్కుంటాడు.అదేమిటంటే..ఆమెకు పిల్లలు పుట్టరు. తనను ఈ సమస్యతో యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీలోనే తను వెళ్తానంటుంది. 

మరో ప్రక్క కృష్ణ తల్లి...తన కొడుక్కు ఎప్పుడు పెళ్లి అవుతుందా..తన తల్లే తన మనవడు లేదా మనవరాలు  రూపంలో  పుడుతుంది అని ఎదురుచూస్తూంటుంది. ఈ విషయం తెలిసిన కృష్ణ ...తను ఈ సమస్య  అమ్మాయిని చేసుకుంటానంటే ఒప్పుకోరు అని ..చిన్న అబద్దం ఆడతాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు తన మగతనం కోల్పోయానని, దాంతో  తనకు పిల్లలు పుట్టరు అని  తన బంధువైన డాక్టర్(వెన్నెల కిషోర్)తో అబద్ధం చెప్పిస్తాడు. దాంతో పెళ్లి అయ్యిపోతుంది. కానీ ఏదో రోజు అసలు నిజం తెలియాలి కదా అదే జరుగుతుంది. అప్పుడు కృష్ణ ఏం చేసాడు. ఆ సమస్యను ఎలా ఫేస్ చేసాడు వంటి విషయాలు తెలియలాంటే సినిమా చూడాలి. 
 
ఇది పెద్దగా ఎగ్డైట్ చేసే స్టోరీ లైన్ కాదు. కానీ నాగశౌర్య కనెక్ట్ అయ్యి తన బ్యానర్ లోనే చేసాడు. డైరక్టర్ అనుభవం ఉన్నవాడే కొన్ని సీన్స్ లో ఫన్ బాగానే పండించాడు ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. అయితే కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ బాగా చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగులే ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది.  CG వర్క్ కూడా బాగోలేదు. ఇక నాగశౌర్య తన పాత్రకు న్యాయం చేసాడు. అందులోనూ సిక్స్ ప్యాక్ కూడా పెంచాడు. హీరోయిన్ షిర్లే జస్ట్ ఓకే.    'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ ఫన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios