2021 సంక్రాంతిని సోలోగా దున్నేశాడు మాస్ మహరాజ్ రవితేజ.  ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న క్రాక్ రికార్డు వసూళ్లు రాబడుతుంది. కేవలం 50% ఆక్యుపెన్సీ తో కూడా క్రాక్ తక్కువ సమయంలోనే లాభాల బాట పట్టడం విశేషం. మొత్తంగా చాలా కాలంగా ప్లాప్స్ తో ఇబ్బందిపడ్డ హీరో రవితేజ సాలిడ్ కొట్టాడు. గతంలో రవితేజకు డాన్ శీను, బలుపు వంటి రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరో హిట్ అందించారు. 


రవితేజ-గోపి చంద్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఆటం బాంబులా పేలింది. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపి చంద్ కి బడా హీరోల నుండి ఆఫర్స్ అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రాక్ సినిమా చూసిన మాస్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ లిస్ట్ లో నటసింహం బాలయ్య పేరు వినిపిస్తుంది. నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మూవీ దాదాపు ఖాయమే అన్న మాట వినిపిస్తుంది.  

ఈ విషయంపై దర్శకుడు గోపిచంద్ మలినేని స్వయంగా స్పష్టత ఇచ్చాడు. బాలకృష్ణతో మూవీ విషయమై చర్చలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. ఇంకా ఫైనల్ కాలేదని గోపీచంద్ ఉన్న విషయం చెప్పారు. కాబట్టి అన్నీ కుదిరితే బాలయ్య నెక్స్ట్ గోపిచంద్ తో ఉంటుందన్న మాట. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.