కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. నాలుగేళ్ళ తర్వాత నాకు మైక్ దొరికింది. చిరంజీవి గారి సినిమాల కోసం చొక్కాలు చించుకున్నవారిలో నేను కూడా ఒకడిని. ఇంత దగ్గరి నుంచి చిరంజీవిని చూశాక ఆయన గొప్పతనం తెలిసింది అని కొరటాల అన్నారు. 

ఈ జర్నీలో చిరంజీవి గారి రూపంలో నాకు రియల్ లైఫ్ లో ఆచార్య దొరికారు. ఈ సినిమాటోగ్రాఫర్ తిరు నా ప్రాణం. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ చిత్రాలకు కూడా ఆయనే పనిచేశారు. ఆచార్య కోసం నాకంటే ఎక్కువగా ఆలోచించారు. అలాగే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కి కృతజ్ఞతలు. 

రాంచరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ చిత్రంలో సిద్ద పాత్ర గురించి చెబుదామని వెళితే.. సినిమా గురించి మాట్లాడడానికి వచ్చానేమో అని అనుకున్నాను. కానీ ఈ పాత్ర గురించి చెప్పిన వెంటనే ఒకే చెప్పారు. నాన్నగారితో ఇంత మంచి పాత్రలో నటించే ఛాన్స్ మళ్ళి వస్తుందో లేదో అనే ఇష్టంతో రాంచరణ్ ఈ చిత్రానికి అంగీకరించారు. 

ఆర్ఆర్ఆర్ టైట్ షెడ్యూల్ కొనసాగుతున్నప్పటికీ మా సినిమా కోసం రాంచరణ్ డేట్స్ అడ్జెస్ట్ చేసిన రాజమౌళి గారికి కూడా ధన్యవాదాలు అని కొరటాల వేదికపై జక్కన్నకి థ్యాంక్స్ చెప్పారు. 

ఏప్రిల్ 29న ప్రతి మెగా అభిమాని పండగ చేసుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది అని కొరటాల హామీ ఇచ్చారు.