దర్శక,రచయిత కొరటాల శివ కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటూంటారని ఆయనతో పనిచేసిన వాళ్లు చెప్తూంటారు. ఆ నిబద్దతే ఆయన్ని ఈ స్టేజీకి తెచ్చింది. అలాగని నిర్మాతల విషయాల్లో సాధారణంగా ఆయన ఎప్పుడూ వేలు పెట్టరు. అందుకే ఆయనంటే స్టార్ హీరోలకు మక్కువ. అఫ్ కోర్స్ హిట్స్ వస్తే ....ఎవరు వేళ్లు, కాళ్లు పెట్టినా హీరోలు పట్టించుకోరనేది వేరే విషయం. ఇక అసలు విషయానికి వస్తే.. దర్శకుడు కొరటాల శివ...రీసెంట్ గా రామ్ చరణ్ కు ఆయన ఓ కండీషన్ పెట్టారట. దాన్ని ఓకే చేస్తేనే రామ్ చరణ్ తదుపరి చిత్రం డైరక్ట్ చేస్తానని అన్నారట. ఊహించని ఈ కండీషన్ విని రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ షాక్ అయ్యారట.

తెలుగు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కొరటాల పెట్టిన కండీషన్ ఏంటంటే... మహేష్ ని ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రంలో కీ రోల్ కు తీసుకోవాలని. ఇప్పటికే మహేష్ ఒప్పుకున్నా...ఆయన రెమ్యునేషన్ బాగా ఎక్కువ అనిపించటంతో వెనకడుగు వేస్తున్నారట. వేరే ఆల్టర్నేటివ్ ని చూస్తున్నారట. దాంతో కొరటాల..ఓ క్రేజీ కాంబినేషన్ ని తెరపై ఆవిష్కరించాలంటే...ఈ మాత్రం పట్టు గా ఉండాలని, కండీషన్ క్రింద దాన్ని పెట్టారట. మరి ఈ విషయమై రామ్ చరణ్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా ఏ డెసిషన్ తీసుకోలేదట. చిరంజీవికు అయితే వేరే ఆలోచనలు ఉన్నాయిట. తన మెగా క్యాంప్ హీరోలలో ఒకరిని గెస్ట్ రోల్ లో తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారట.

‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో సక్సెస్  అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఓ మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. 

ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడని మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దీంతో చిరు-మణిల కాంబో సంగీత ప్రియుల్ని మరోసారి మైమరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్‌ సరసన త్రిష నటించనుందని సమాచారం.

ఇక ఈ సినిమా దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు.. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి  ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.  ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.