మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట`లోనూ హీరోయిన్‌గా కియారానే తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పింది. ఇక ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ మాత్రం కియారాని తెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు.
కియారా అద్వానీపై అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్ మోజు పడుతుంది. ఆమెపై బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. కానీ ఆమేమో బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ఇప్పుడిది పెద్ద తంటగా మారింది. మరి ఇంతకి కియారా తెలుగులోకి వస్తుందా? రాదా? అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.
కియారా అద్వానీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ మహేష్ సరసన `భరత్ అనే నేను`లో హీరోయిన్‌గా నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. క్యూట్, ఘాటు మేళవించిన అందాలతో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత `వినయ విధేయ రామ`లోనూ మెరిసింది. ఈ సినిమా పరాజయం ఆమెని బాలీవుడ్‌లో బిజీ చేసింది. ఈ చిత్రం విజయం సాధిస్తే, ఆమె తెలుగులోనే బిజీ అయ్యేది. అయితే బాలీవుడ్‌లో `కబీర్ సింగ్`తో బంపర్ హిట్ ని అందుకున్న ఆమెకి బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. `కబీర్ సింగ్` తెలుగు `అర్జున్‌రెడ్డి`కి రీమేక్ అన్నది తెలిసిందే.
మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట`లోనూ హీరోయిన్‌గా కియారానే తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పింది. ఇక ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ మాత్రం కియారాని తెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు. చిరంజీవి హీరోగా రూపొందిస్తున్న `ఆచార్య` చితంలో రామ్‌చరణ్ కీలకపాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన కియారాని నటింప చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ కూడా కియారానే కావాలంటున్నారట. మరి కియారా తెలుగులోకి వస్తుందా? చెర్రీతో రొమాన్స్ చేస్తుందా? అన్నది చూడాలి.
కియారా బాలీవుడ్‌లో ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో `లక్ష్మీబాంబ్`, లేడీ ఓరియెంటెడ్ చిత్రం `ఇందూ కి జవానీ`, తన ప్రియుడు సిద్ధార్థ్‌తో కలిసి `షేర్షా`, కార్తీక్ ఆర్యన్‌తో కలిసి `భూల్ భులైయ్యా 2`లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
