‘కూత్తుపట్టరై’ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కోలీవుడ్‌లో నట గురువుగా ప్రఖ్యాతిగాంచిన ముత్తుస్వామి ఎందరో సినీనటులకు.. నటనలో శిక్షణనిచ్చి వారిని స్టార్లుగా తీర్చిదిద్దారు.

ప్రముఖ హీరోలు విజయ్ సేతుపతి, విమల్, విదార్థ్‌లు ఆయన శిష్యులే. తమిళనాట ఎవరైనా కొత్త హీరో కావాలంటే కూత్తుపట్టరైనే సంప్రదిస్తారు దర్శక,నిర్మాతలు. తంజావూరు జిల్లా పుంజై ఆయన స్వగ్రామం.. కళారంగంపై ఆసక్తితో ‘‘కూత్తుపట్టరై’’ని స్థాపించిన ఆయన మొదట్లో వీధి నాటకాల్లో శిక్షణ ఇచ్చేవారు. ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చి సినీరంగానికి అవసరమైన నటులను అందించేవారు. ఆయన మరణంతో కోలీవుడ్‌లో విషాదంలో మునిగిపోయింది.