రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం విరాటపర్వం. పీరియాడిక్ లవ్ అండ్ రెవల్యూషనరీ డ్రామాగా విరాటపర్వం తెరకెక్కుతుంది. కాగా సాయి పల్లవిపై తెరకెక్కిన 'కోలు కోలు..' అంటూ సాగే సాంగ్ లిరికల్ ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. ఈమేరకు నిన్న చిత్ర యూనిట్ ప్రకటన చేయడం జరిగింది. అయితే నేడు ఈ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. 

చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ కి సురేష్ బొబ్బిలి చక్కని బాణీలు ఇవ్వగా.. సింగర్ దివ్య మాలిక అద్భుతంగా పాడారు. కొలు కోలు సాంగ్ ప్రోమో అద్భుతంగా ఉంది. ఇక సాంగ్ లో పచ్చని పరికిణీ, పసుపు ఓణీలో డాన్స్ చేస్తున్న సాయి పల్లవి ఆకట్టుకున్నారు. విరాటపర్వంలో సాయి పల్లవి 90లనాటి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. 


షూటింగ్ దశలో ఉన్న విరాటపర్వం మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. మరో హీరోయిన్ ప్రియమణి విరాటపర్వంలో కీలక రోల్ చేస్తున్నారు. భారతక్క అనే లేడీ నక్సల్ గా ఆమె కనిపించనున్నారు. అనేక ప్రత్యేకతలు కలిగిన విరాటపర్వం మూవీ ఏప్రిల్ 30న గ్రాండ్ గా విడుదల కానుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు.