'కొబ్బరిమట్ట' ప్రతి బ్యాచిలర్ కొంపలో ఇక ఇదే!

First Published 2, Jul 2018, 6:29 PM IST
kobbarimatta movie ready for release
Highlights

సంపూర్నేష్ బాబు హీరోగా గతంలో 'హృదయకాలేయం','సింగం 12౩' వంటి సినిమా రూపొందాయి

సంపూర్నేష్ బాబు హీరోగా గతంలో 'హృదయకాలేయం','సింగం 12౩' వంటి సినిమా రూపొందాయి. హృదయకాలేయం చిత్ర దర్శకుడు సాయి రాజేష్ సంపూర్నేష్ బాబు హీరోగా 'కొబ్బరిమట్ట' అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మొదలయ్యి దాదాపు రెండేళ్లు దాటింది. 2016లో సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాత సాయి రాజేష్ సోషల్ మీడియాలో వెల్లడించారు. 

'ప్రతి బ్యాచిలర్ కొంపలో.. మందు సిట్టింగ్ కు బెస్ట్ స్టఫ్ 'కొబ్బరిమట్ట' అవబోతుంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాను చూసి మీరు నవ్వుకోబోతున్నారు. మీ అందరి ప్రేమ, ఆదరణ మాకు కావాలి. ఏడాదిన్నర కష్టం ఈ సినిమా. కష్టం అనేది చిన్న మాట. ఈ సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనేది నా బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన' అంటూ ట్వీట్ చేశారు. 

loader