బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట సినిమా 12 కోట్లు గ్రాస్ మూడు రోజుల్లో క్రాస్ చేసిందని నిర్మాత సాయి రాజేష్ ప్రకటించారు. ఆశ్చర్యపోతున్నారా..షాకింగ్ గా ఉందా..ఉంటుంది...అలా ఉండాలనే ఇలాంటి పోస్టర్ వేసారు. అయితే అదే పోస్టర్ లో క్రింద...తొమ్మిది కోట్లు ఫేక్ కలెక్షన్స్ ..ఫ్యాన్స్ కోసం యాడ్ చేసామని చెప్పారు. మొదటి నుంచి సినిమా పబ్లిసిటీలోనూ వ్యంగ్య ధోరణిలో వెళ్తున్న సాయి  రాజేష్ ..సినిమా రిలీజ్ అయ్యాక వేసే పోస్టర్స్ లోనూ ఇలా చేయటం ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో చర్చనీయీంసంగా మారింది.

ఈ మధ్యకాలంలో ప్రతి పెద్ద సినిమా ఫేక్ కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతోంది. రిలిజైన రెండో రోజునుంచే అంత దాటింది..వంద కోట్లు దగ్గర అంటూ పోస్టర్స్ పడిపోతున్నారు. అభిమానులకు బుర్ర ఉంటుంది వాళ్లు ఆలోచిస్తారు అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ తరహా పబ్లిసిటీ చేస్తున్నారు. అలాటి ధోరణిలపై ఈ పోస్టర్ ఓ వ్యంగ్యాస్త్రం.

రీసెంట్ గా భరత్ అనే నేను, అరవింత సమేత, జై లవకుశ, మహర్షి ఈ చిత్రాలు అన్ని ఫేక్ కలెక్షన్స్ అంటూ కాంట్రవర్శికి గురి అయ్యినవే కావటం విశేషం. ఇప్పుడు ఆ అభిమానులంతా భుజాల తడుముకునే పరిస్దితి ఈ పోస్టర్ కల్పించింది.  

ఇక హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిన సంపూ .. అ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన ఆడలేదు. దీనితో హృదయకాలేయం టీమ్ మళ్ళీ కొబ్బరిమట్ట సినిమాతో సంపూని రీలాంచ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకుల ముదుకు తీసుకు వచ్చింది .  ఎన్నో అడ్డంకుల మధ్య ఈ శనివారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి హిట్ రిపోర్ట్ వచ్చింది.