పెషావర్ నగరంతో దిలీప్ కుమార్ విడదీయరాని బంధం కలిగి ఉన్నారు. ఆయన బాలల్యం అక్కడే గడిచింది. పెషావర్ నగరంలో దిలీప్ కుమార్ కుటుంబానికి ఓ పురాతన హవేలీ ఉంది. పెషావర్ నడిబొడ్డున గల ఈ హవేలీతో దిలీప్ కుమార్ కి ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయట.


లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ జూన్ 7న మరణించగా, ఆయన జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు అభిమానులు. కాగా అఖండ భారతంలో ప్రస్తుత పాకిస్థాన్,పెషావర్ లో జన్మించారు దిలీప్ కుమార్. ఆయన అసలు పేరు యూసుఫ్ ఖాన్. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాక పెద్దల సలహా మేరకు దిలీప్ కుమార్ గా పేరు మార్చుకున్నారు. పాకిస్తాన్ చారిత్రాత్మక నగరాలలో ఒకటైన పెషావర్ దిలీప్ కుమార్ జన్మస్థలం. 


పెషావర్ నగరంతో దిలీప్ కుమార్ విడదీయరాని బంధం కలిగి ఉన్నారు. ఆయన బాలల్యం అక్కడే గడిచింది. పెషావర్ నగరంలో దిలీప్ కుమార్ కుటుంబానికి ఓ పురాతన హవేలీ ఉంది. పెషావర్ నడిబొడ్డున గల ఈ హవేలీతో దిలీప్ కుమార్ కి ఎన్నో తీపి గురుతులు ఉన్నాయట. మరి ఇప్పుడు ఆ హవేలీ ఎలా ఉంది... అనేది ఆయన ఫ్యాన్స్ లో నెలకొని ఉన్న ఆసక్తి. 


పెషావర్ నగరంలో గల ఆ వందేళ్ల నాటి పురాతన హవేలీ ఎవరూ నివసించకపోవడం వలన చాలా దెబ్బతింది. అలాగే ఆ హవేలీ ప్రస్తుతం దిలీప్ ఆధీనంలో లేదు. 2014లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ హవేలీని పాకిస్థాన్ వారసత్వ సంపదగా ప్రకటించి, స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ భవనాన్ని పునరుద్ధరించి మ్యూజియం గా మార్చనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. 


ఆ భవనం ఉన్న ప్రదేశానికి దగ్గర్లో మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నివాస భవనము కూడా ఉండేదట. ఆ భవనాన్ని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందట. గత ఏడాది ఓ జర్నలిస్ట్ దిలీప్ కుమార్ పెషావర్ హవేలీ ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేయగా, దిలీప్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

Scroll to load tweet…