వెనక్కి తగ్గిన కిరణ్ అబ్బవరం.. `రూల్స్ రంజన్` రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న `రూల్స్ రంజన్` మూవీ రిలీజ్ డేట్ మారింది. వారం రోజులు వెనక్కి తగ్గారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. తాను హీరోగా నటిస్తున్న `రూల్స్ రంజన్` మూవీ రిలీజ్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. సరైన డేట్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేశాడు. ప్రభాస్ మూవీ `సలార్` వాయిదా పడటంతో, మరో సెకండ్ థాట్ లేకుండా సెప్టెంబర్ 28న కన్ఫమ్ చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఇందులో టీమ్ అంతా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇన్నాళ్లకి సరైన డేట్ దొరికిందని భావించారు. కానీ ఆ సంతోషం లేకుండా పోయింది. వెంట వెంటనే మిగిలిన సినిమాలు కూడా అదే డేట్‌కి వచ్చి పడ్డాయి.
రామ్ పోతినేని, బోయపాటిల `స్కంధ` అదే డేట్‌కి వచ్చిపడింది. ఆ తర్వాత `చంద్రముఖి2` సైతం వచ్చింది. సెప్టెంబర్ 15న రావాల్సిన ఈ రెండు చిత్రాలు రెండు వారాలు వెనక్కి తగ్గి `సలార్` డేట్‌కి వచ్చిపడ్డాయి. దీంతోపాటు ఎన్టీఆర్ బావమరిది నటిస్తున్న `మ్యాడ్` చిత్రం కూడా అదే రోజు రాబోతుంది. ఇలా మరో ఒకటి రెండు చిత్రాలు సేమ్ డేట్‌కి రాబోతున్నాయి. దీంతో ఆ డేట్ చాలా టైట్‌గా మారింది. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం వెనక్కి తగ్గాడు. ఓ వారం పోస్ట్ పోన్ చేశారు.
దీంతో ఇప్పుడు `రూల్స్ రంజన్` కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించింది. మరింత వినోదాన్ని అందించేందుకు రిలీజ్ డేట్ మార్చినట్టు తెలిపింది యూనిట్. ప్రతి ఒక్కరూ సినిమా చూసి వినోదం లో తెలియాడాలనే ఉద్దేశ్యం, మరింత మందికి చేరువ కావాలనే సదుద్దేశ్యంతో , పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ను అక్టోబర్ 6 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.
`అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాల కు అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. 'రూల్స్ రంజన్' నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన మెరుగైన ప్రతిభ ను కనబరుస్తున్నారు. సినిమా మరింత మందికి చేరువ కావాలనే సదుద్దేశ్యంతో అక్టోబర్ 6 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నాం. చిత్ర కథ, దానికి అనుగుణంగా సాగే సన్నివేశాలు, వాటికి తగ్గట్లుగా సంభాషణలు, వీటన్నింటినీ స్థాయిని పెంచే రీతిలో నేపథ్య సంగీతం, సందర్భ శుద్ధి గా సాగే పాటలు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయి` అని నిర్మాతలు అన్నారు.
రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా నేహా శెట్టి యాక్ట్ చేస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. పాటల్లో హైలైట్‌గా నిలిచింది. అది సినిమాపై క్రేజ్‌ని పెంచుతుంది. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి 'రూల్స్ రంజన్' సినిమాని నిర్మిస్తున్నారు.