‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ‘సెబాస్టియన్ 524 పీసీ’మూవీతో రానున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను లాంచ్ చేశారు.   

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన 'రాజావారు రాణిగారు' సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు - మాసు, యూత్ - ఫ్యామిలీ... అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు కిరణ్. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. 'సెబాస్టియన్ పిసి 524'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను టీలీజ్ చేశారు మేకర్.

 కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన మూవీ 'సెబాస్టియన్‌ పిసి524'. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ ఈ మూవీని నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదల కానుంది. కాగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Scroll to load tweet…

రేచీకటితో బాధపడుతున్న సెబాస్టియన్, కానిస్టేబుల్ గా డ్యూటీ చేయాల్సి వస్తుంది. అప్పటికే నైట్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న హీరో ఎదుర్కొనే సమస్యలు, వాటి చుట్టూ సాగే కథ కొంత నవ్వులు పూయించేలా ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, కిరణ్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది. మరోవైపు కిరణ్ రోమాన్స్ లోనూ తగ్గలేదు. యూత్ కు కనెక్టయ్యే ఎలమెంట్స్ ను సినిమాలో బాగానే చూపించబోతున్నట్టు టీజర్ ద్వారా అర్థమైపోతోంది. కిరణ్ తన యాక్టింగ్, టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు.

'దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం', 'ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు', 'నేను దేవుడి బిడ్డను కాదన్నమాట' అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు 'సెబాస్టియన్ పిసి524'లో ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, ప్రమోద్‌, రాజు, కథ - దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి వహిస్తున్నారు.