‘ ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే మీ ‘సెబాస్టియన్ పి సి 524′ ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మీరు అదే రోజు మీ సినిమాను విడుదల చేస్తారు.’ అని అడిగాడు.
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం అతి తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఎస్ ఆర్ కల్యాణమండపం (SR Kalyana Mandapam) సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసాడు. పాటలు మంచి హిట్ అవటం, మంచి నటన అతనికి కలిసి వచ్చింది. ఈ కడప హీరో త్వరలో ‘సెబాస్టియన్ పి సి 524’ (Sebastian PC 524) తో మరోసారి మనల్ని అలరించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇక అసలు విషయానికి వస్తే తను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని చెప్పుకుంటాడీ హీరో.
అయితే తన‘సెబాస్టియన్ పి సి 524’సినిమాని ...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్ (Bheemal Nayak)’న రిలీజకు పెట్టాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని పరిస్థితులకు అనుగుణంగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లానాయక్’ సినిమాని విడుదల చేస్తామని ఇటీవల దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈక్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఈ హీరోకు ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్న వేశాడు.
‘ ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే మీ ‘సెబాస్టియన్ పి సి 524′ ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మీరు అదే రోజు మీ సినిమాను విడుదల చేస్తారు.’ అని అడిగాడు.
దీనికి స్పందించిన ఈ యంగ్ హీరో ..’నేను మీకంటే కాస్త ఎక్కువగానే ‘భీమ్లా నాయక్’ కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా విడుదల అయినా కూడా.. నేను పవర్ స్టార్ సినిమాకే మొదటి షో వెళతాను.. ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే’.. అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కొందరు పవర్ స్టార్ అభిమానులకు నచ్చింది కానీ చాలా మంది దీన్ని ఓవర్ యాక్షన్ గా భావించి ట్రోల్ చేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ వాయిదే పడే అవకాసం ఉండబట్టే సెబాస్టియన్ పి సి 524 అని ఆరోజు తెస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా తో పాటు ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణు కథా’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు కిరణ్.
