కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్.  దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. అలాగే రిలీజ్ డేట్ ప్రకటించారు. ది ఘోస్ట్ ఫస్ట్ గ్లిమ్ప్స్ బీభత్సంగా ఉంది.   


జయాపజయాలతో సంబంధం లేకుండా నాగార్జున వరుస చిత్రాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఆయన నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా... బంగార్రాజు హిట్ రిజల్ట్ దక్కించుకుంది. బంగార్రాజు ఫాంటసీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నాగ చైతన్య మరో హీరోగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మల్టీస్టారర్ విన్నర్ గా నిలిచింది. ఆ మూవీ ఇచ్చిన విజయంతో ది ఘోస్ట్ చిత్రాన్ని నాగార్జున చకచకా పూర్తి చేశారు. 

గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఆకాశంలో బ్లడ్ మూన్ ఉండగా క్రింద నాగార్జున కత్తితో నరమేధం చేస్తున్నాడు. నిజంగానే నాగార్జున కిల్లింగ్ మిషన్ లా ఉన్నారు. ఓ నిమిషం కంటే తక్కువ నిడివి కలిగిన ది ఘోస్ట్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆకట్టుకుంది. నాగార్జున లుక్, యాక్షన్ స్టంట్స్ అలరించాయి. ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 

ది ఘోస్ట్ మూవీ అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే దసరా కానుకగా విడుదల కానుంది. ది ఘోస్ట్ డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో పుకార్లకు నేడు చెక్ పెట్టారు. ఇక ఘోస్ట్ అంటే ఇదేదో హారర్ మూవీ కాదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. సినిమాలో తన కోడ్ నేమ్, నా క్యారెక్టర్ పేరు విక్రమ్ అని తెలియజేశారు. కాగా దసరా బరిలో చిరంజీవి గాడ్ ఫాదర్, బాలకృష్ణ 107 దిగుతున్నట్లు వార్తలు వస్తుండగా తాజా ప్రకటనతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ది ఘోస్ట్ మూవీలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించారు.