మన తారలు పబ్లిసిటీ కోసం రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. కొందరు హాట్ ఫోటో షూట్లలో పాల్గొని అభిమానులతో షేర్ చేయడం, లైవ్ చాట్ లు ఇలా చాలానే ఉంటాయి. అయితే తాజాగా బాలీవుడ్ భామ కిమ్ శర్మ పబ్లిసిటీ కోసం ఓ ఆటోలో చక్కర్లు కొడుతూ కనిపించింది. 

ముంబై నగరంలో బాంద్రా వీధుల్లో అర్ధరాత్రి ఆటో రిక్షాలో చక్కర్లు కొట్టింది ఈ బ్యూటీ. రెడ్ గ్రే టీ షర్ట్, షార్ట్స్ ధరించి ఆటో ఎక్కేసింది. ఆమెని గమనించిన ఫోటో జర్నలిస్ట్ లు ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె తెలుగులో 'ఖడ్గం', 'మగధీర' వంటి చిత్రాల్లో కనిపించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. రీసెంట్ గా తన భర్తకి విడాకులిచ్చి కొంతకాలంవరకు హీరో హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేసింది. ఈ మధ్య ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది.