బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వేసుకునే విధంగా బట్టలు వేసుకోవడానికి ఏ హీరో సాహసించడనే చెప్పాలి. ప్రతీసారి ఏదో కొత్తగా ట్రై చేయాలని వింత వింత డ్రెస్సులు ధరిస్తూ ఉంటాడు ఈ స్టార్ హీరో.

తాజాగా అతడు తన డ్రెస్సింగ్ స్టైల్ లో ఓ చిన్నారిని భయపెట్టేశాడు. మోకాలి పొడవు ఉన్న రెడ్ కలర్ హుడీ ధరించి ముంబయిలోని ఓ డబ్బింగ్ స్టూడియోకి వెళ్లాడు రణ్‌వీర్. ఆ సమయంలో రణ్‌వీర్‌తో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నాడు. ఓ వ్యక్తి తన కూతురిని తీసుకొని రణవీర్ దగ్గరకి వెళ్లాడు.

రణవీర్ కారు ఎక్కే సమయంలో సదరు వ్యక్తి కారు డోర్ దగ్గరే ఉండడంతో రణవీర్ ఆ చిన్నారిపై చేయి వేశాడు. రణవీర్ డ్రెస్సింగ్ అతడి కళ్లజోడు చూసిన భయపడిందో ఏమో వెంటనే గుక్క పెట్టి ఏడ్చేసింది ఆ చిన్నారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణవీర్ డ్రెస్ పై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి ట్రోలింగ్ అతడికి కొత్తేమీ కాదు. గతంలో కూడా రణవీర్ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఓసారి రణ్‌వీర్ తెల్ల డ్రెస్సు వేసుకుని బయటికి వచ్చాడు. అది చూడటానికి అచ్చం కండోమ్‌లా ఉందని నెటిజన్లు తెగ కామెంట్లు చేశాడు. అయినప్పటికీ రణవీర్సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Lil kiddo got scared of dhongi Baba 🙄🤔

A post shared by Viral Bhayani (@viralbhayani) on Oct 1, 2019 at 10:09pm PDT