బాలీవుడ్ భామలు కూడా ఈ మధ్య టాలీవుడ్ అవకాశాలపై తెగ ట్రయల్స్ వేస్తున్నారు. అవకాశం వస్తే ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. సాధారణంగా మోడలింగ్ ప్రపంచంలో ఉన్నప్పుడు నార్త్ బ్యూటీలు మొదట టాలీవుడ్ లో ఒక సినిమా చేస్తే కెరీర్ బావుంటుందని సెంటిమెంట్ గా భావిస్తుంటారు. 

బాలీవుడ్ లో చాలా మంది ఆ సెంటిమెంట్ ఫాలో అయ్యి బాలీవుడ్ లో స్టార్స్ అయ్యారు. అయితే ఇప్పుడు కాస్త బిన్నంగా బాలీవుడ్ లో చేస్తూనే టాలీవుడ్ లో కూడా సినిమాలు చేయవచ్చని కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆలోచిస్తున్నారు. ఆ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది కియారా అద్వానీ. 

భరత్ అనే నేను సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కనిపించిన అమ్మడు మంచి సక్సెస్ తో తన మార్కెట్ ను పెంచుకుంది. వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బేబీ డిమాండ్ కి గండి పడలేదు. బాలీవుడ్ లో కబీర్ సింగ్ ఆమె రేంజ్ ని ఇంకాస్త పెంచేసింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో కూడా బేబీకి ఆఫర్స్ వస్తున్నాయి. 

రీసెంట్ గా ఇలయథలపతి విజయ్ కి సంబందించిన కొత్త ప్రాజెక్ట్ రాగానే వెంటనే ఒప్పేసుకుంది. యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పిన కథను మరికొన్ని రోజుల్లో విజయ్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న కియారాను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాతో కబీర్ సింగ్ బ్యూటీ కోలీవుడ్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.