దాని కోసం ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్న కియారా అద్వానీ.. రామ్‌చరణ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..
పెళ్లి తర్వాత వెంటనే సినిమాలతో బిజీ అయ్యారు సిద్ధార్థ్, కియారా. ఇదిలా ఉంటే మ్యారేజ్ అయి ఆరు నెలలు అవుతుంది. పిల్లల ఆలోచన కనిపించడం లేదు. కానీ ఆ మధ్య కియారా ప్రెగ్నెంట్ అనే రూమర్స్ వినిపించాయి.

కియారా అద్వానీ టాలీవుడ్‌లో మెరిసి బాలీవుడ్‌లో సెటిల్ అయిన హీరోయిన్. అక్కడ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. తనదైన స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతుంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ తెలుగులో మెరుస్తుందీ భామ. ఇటీవల తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా అద్వానీ పెళ్లిచేసుకన్న విషయం తెలిసిందే. చాలా గ్రాండ్‌గా వీరి వివాహం రాజస్థాన్ ప్యాలెస్‌లో జరిగింది.
పెళ్లి తర్వాత వెంటనే సినిమాలతో బిజీ అయ్యారు సిద్ధార్థ్, కియారా. ఇదిలా ఉంటే మ్యారేజ్ అయి ఆరు నెలలు అవుతుంది. పిల్లల ఆలోచన కనిపించడం లేదు. కానీ ఆ మధ్య కియారా ప్రెగ్నెంట్ అనే రూమర్స్ వినిపించాయి. ఆమె కాస్త బొద్దుగా మారి, పొట్టభాగం లావుగా కనిపించడంతో అంతా కియారా ప్రెగ్నెంట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె స్లిమ్‌గా మారిపోయింది. దీంతో అది నిజం కాదని ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రెగ్నెంట్‌పై కియారా స్పందించిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ నాలుగేళ్ల క్రితమే ప్రెగ్నెంట్ కావడంపై స్పందించింది. తనకు ప్రెగ్నెంట్ కావాలనే కోరిక చాలా రోజుల నుంచే ఉందట. ఓ ఇంటర్వ్యూలో కియారా ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 లోతాను నటించిన `గుడ్ న్యూస్` సినిమా రిలీజ్ టైమ్ లో ఆమె చెబుతూ, తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని చెప్పింది. ఎందుకంటే ఆ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని వెల్లడించింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అని చెప్పింది. మొత్తంగా నచ్చిన ఫుడ్ తినడం కోసం కియారా ప్రెగ్నెంట్ కావాలనుకోవడం ఆశ్చర్యపరుస్తుంది.
ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి అయ్యింది. శుభవార్త చెప్పేందుకు టైమ్ వచ్చింది. మరి ప్రెగ్నెంట్ అంటూ ఎప్పుడు శుభవార్త చెబుతుందో, తన కోరిక ఎప్పుడు నెరవేర్చుకుంటుందో చూడాలి. ఇక `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కియారా అద్వానీ, తొలి చిత్రంతోనే మహేష్‌తో కలిసి నటించే అవకాశం అందుకుంది. అదే సమయంలో హిట్ కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` సినిమా చేసింది. ఇది బోల్తా కొట్టింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `గేమ్ ఛేంజర్`లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు హృతిక్‌తో `వార్ 2`లో నటిస్తుంది కియారా.