100 కోట్లు దాటిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్

khidi crosses 100 crores pre release
Highlights

  •  రిలీజ్ కు ముందే కోట్లు కొల్లగొడుతున్న మెగాస్టార్ మూవీ
  • 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ క్రియేట్ చేసిన చిరంజీవి ఖైదీనెంబర్ 150
  • మెగా స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించిన ఖైదీ నెంబర్ 150

 

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే అదరగొట్టింది. మెగాస్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఇండస్ట్రీ వర్గాలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపుతోంది. ఇప్పటికే థీట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నీ కలిపి 100 కోట్లకు పైగా బిజినెస్ చేసేసింది. వివి వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

 

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 11న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుంటూరు హాయ్ లాండ్ లో జనవరి 7న గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

నైజాం : రూ.21.5Cr.(Asian Films / Geetha)

సీడెడ్ : Rs 11.7 Cr (Rayudu)
యూఎస్ఏ : Rs 7.8 Cr (AV cinema)
ఈస్ట్ : Rs 5.4 Cr (Anusri Films)

వెస్ట్ : Rs 4.6 Cr (Shanmuka Films)
కృష్ణా : Rs 4.6 Cr (G3 Movies)
గుంటూరు : Rs 6.4 Cr (V Celluloids)
నెల్లూరు : Rs 3.0 Cr (S2 cinemas)

మొత్తం ఏపీ/తెలంగాణ : Rs 65 Cr

కర్ణాటక : Rs 8.5 Cr (Brunda Associates)
తమిళనాడు: Rs 1 Cr (SPI Cinemas)
రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 1 Cr
ఓవర్సీస్ : Rs 12 Cr (Classics Cinemas)

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థీట్రికల్ రైట్స్ : Rs 87.5 Cr

శాటిలైట్ రైట్స్ : Rs 13 Cr ( MAA TV)

ఆడియో మరియు ఇతర హక్కులు : Rs 2.5 Cr

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్: రూ.103 Cr.

 

 

loader