నార్త్ లోనూ ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ గురించి మాట్లాడుకుంటున్నారు. హిందీ డబ్బింగ్ సినిమా తొలిరోజే సరికొత్త రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2'. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ 2 పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు నిన్న (ఏప్రిల్ 14) విడుదలైంది. బాక్సాఫీసు వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది.

రిలీజ్ కు ముందు నుంచీ కేజీఎఫ్‌-2 సినిమాకు దేశ‌వ్యాప్తంగా హైప్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ క‌ర్ణాట‌క‌లో వ‌సూలు చేసిన‌దానికంటే ఎక్కువ‌గా.. కేజీఎఫ్‌-2 తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ట్ చేయ‌బోతోందని మొదటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేద‌ు. రిలీజ్ వారం ముందు నుంచే అక్క‌డ అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌లు కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌య్యాయి . రిలీజ్ తర్వాత అయితే చెప్పక్కర్లేదు. నార్త్ లోనూ ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ గురించి మాట్లాడుకుంటున్నారు. హిందీ డబ్బింగ్ సినిమా తొలిరోజే సరికొత్త రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

‘బాహుబలి 2’ కంటే మొదటి రోజు కలెక్షన్లు భారీగా ఉన్నాయి. సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, అమీర్‌ఖాన్‌ లాంటి బాలీవుడ్‌ పెద్ద స్టార్లు కూడా ‘కెజిఎఫ్‌ చాప్టర్‌ 2’కి ఇంత భారీ ఓపెనింగ్స్‌ రాలేదు. నిజంగానే ‘కెజిఎఫ్ 2’ బాక్సాఫీస్ దద్దరిల్లింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు కన్నడ సూపర్ స్టార్ యష్ కొత్త పాన్-ఇండియన్ స్టార్స్ అయ్యారు. ఈ చిత్రం తెలంగాణలో అయితే ఐదవ అతిపెద్ద ఆల్ టైమ్ ఓపెనర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.

కేజీయఫ్ 2కు హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా హిందీ భాషలో తొలిరోజే కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పుడో దాటేసిన కేజీయఫ్, తొలిరోజు వసూళ్లతో హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది.

కేజీయఫ్ 2 ఓపెనింగ్ రోజున ఏకంగా రూ.38-39 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని హిందీ మార్కెట్ వర్గాలు అంచనా. ఈ రేంజ్‌లో బాలీవుడ్‌లో ఇప్పటివరకు తొలిరోజు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఏ సినిమా కూడా లేకపోవడంతో, బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్ అని అంటున్నారు కేజీయఫ్ అభిమానులు. ఇక ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మేరకు బాలీవుడ్ టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో కేజీయఫ్ 2 చిత్రానికి టాప్ ప్లేస్‌లో స్థానం ఇచ్చాడు. ఇక రెండో ప్లేస్‌లో బాహుబలి 2 చిత్రం నిలిచినట్లు ఆయన లెక్కలతో సహా పేర్కొన్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ 2 స్పీడు చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

సొంత రాష్ట్రం క‌ర్ణాట‌కలో ఎలాగూ కేజీఎఫ్‌-2 వ‌సూళ్ల మోత మోగించ‌డం ఖాయం. ద‌క్షిణాదిలోని త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లోనూ ఈ చిత్రానికి మంచి హైపే క‌నిపించ‌డంతో.. క‌రోనా త‌ర్వాత హిందీ మార్కెట్లో అత్య‌ధిక తొలి రోజు వ‌సూళ్లు సాధించ‌బోయే సినిమాగా కేజీఎఫ్‌-2 నిల‌ిచి బాలీవుడ్ కు షాక్ ఇచ్చినట్లు ట్రేడ్ పండిట్లు అంటున్నారు.