Asianet News TeluguAsianet News Telugu

#Yash : బాలీవుడ్ అడ్డాలో.. దక్షిణాది చిత్రాలపై కేజీఎఫ్ స్టార్ షాకింగ్ కామెంట్స్.. ‘కేజీఎఫ్3’పైనా క్లారిటీ!

‘కేజీఎఫ్’తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ యష్ (Yash) పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. తాజాగా బాలీవుడ్ గడ్డపై దక్షిణాది చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరల్ గా మారాయి. 
 

KGF Star Yash Shocking Comments on South Movies in Mumbai!
Author
First Published Nov 6, 2022, 6:05 PM IST

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘కేజీఎఫ్’ రెండు భాగాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ యష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషనలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా హ్యయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ లో ‘కేజీఎఫ్2’ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ బెల్ట్ లో ఈ చిత్రం రచ్చ చేసిందనే చెప్పాలి. దీంతో స్టార్ హీరో యష్ కూడా నార్త్ లో అభిమానులను సాధించుకున్నాడు. పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇదిలా ఉండగా.. దక్షిణాది చిత్రాలపై యష్ తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న యష్ మాట్లాడుతూ సౌత్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యష్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సౌత్ సినిమాలను చూసి నవ్వుకునే వారని. అదేం యాక్షన్ అంటూ కామెంట్స్ చేసే వారని అన్నారు.  కానీ రాజమౌళి తెరకెక్కించిన  ‘బాహుబళి’తో దక్షిణాది చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చిందని, ఆడియెన్స్ కూడా సౌత్ సినిమాలను ఆదరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే బాలీవుడ్ చిత్రాలకు అడ్డాగా ఉన్న ముంబైలో సౌత్ సినిమాలపై ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అలాగే ‘కేజీఎఫ్3’పైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు యష్. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ ఛాప్టర్ 2తో సంచలనం రేపారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ‘కేజీఎఫ్3’(KGF3)పైనా మేకర్స్ గతంలోనే  క్లారిటీ ఇచ్చారు. తాజాగా యష్ కూడా మరోసారి  స్పందించారు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభం కాదన్నారు. ఇంకా సమయం పడుతుందని  తెలిపారు. ప్రస్తుతానికి తను ఇతర ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టినట్టు పేర్కొన్నారు. త్వరలోనే తదుపరి చిత్రాల వివరాలను వెల్లడిస్తామని అన్నారు. ఇప్పటికే యష్ - తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో భారీ బడ్జెట్ సినిమా రాబోతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరీ యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందనేది.

Follow Us:
Download App:
  • android
  • ios