తాజాగా కేజీఎఫ్ 2 విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు హోంబలే ఫిలింస్ (Hombale films) నిర్మాతలు. చిత్ర బృందం పలు దేవాలయాలను సందర్శించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 ఆన్ ఏప్రిల్ 14 అని ప్రకటించారు.
కన్నడ స్టార్ యశ్‌ని (Yash) భాషతో సంబంధం లేకుండా కోట్లాదిమందికి దగ్గర చేసిన చిత్రం ‘కేజీఎఫ్’ (KGF).షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పార్ట్ 2 గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వేసవి కానుకగా ఈఏడాది ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్-2’ (KGF 2)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం గతేడాది ప్రకటించింది.
‘కేజీఎఫ్-2’ (KGF 2) సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ‘‘గమనిక: ప్రమాదం ముందుంది’’ అని పేర్కొంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌లో ఏప్రిల్ 14నే చిత్రాన్ని విడుదల చేస్తామని మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు మరోసారి అదే విషయం ఖరారు చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో తాజా అప్డేట్.. కేజీఎఫ్‌లోనూ ఓ స్పెషల్ సాంగ్.. లైగర్ భామ అనన్య పాండే చేయనుందని సమాచారం. కన్నడలో తమన్నా, హిందీలో మౌనీ రాయ్ ఈ పాటను చేశారు. ఈ సాంగ్ చాలా పాపులర్ కావడంతో కేజీఎఫ్2లోనూ అలాంటి మాస్ సాంగ్ పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ షోలేలో పాపులరైన మెహబూబా మెహబూబా పాటను రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ పాట చిత్రీకరణ కూడా ఇప్పటి ఆడియప్స్‌ని దృష్టిలో పెట్టుకుని మరికొంత మసాలా యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్.
‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్ (Prasanth Neel) దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ‘అధీరా’ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు.
