ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీనే సృష్టించింది. రెండు భాగాల్లో ప్రశాంత్ నీల్ ప్రతి పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో నటి మాళవిక అవినాష్ జర్నలిస్ట్ పాత్రలో మెరిసింది. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీనే సృష్టించింది. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. రెండు భాగాల్లో ప్రశాంత్ నీల్ ప్రతి పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో నటి మాళవిక అవినాష్ జర్నలిస్ట్ పాత్రలో మెరిసింది. 

ఈ చిత్రంలో ఆమె కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ.. కథని ముందుకు నడిపే పాత్ర ఆమెది. అందుకే కెజిఎఫ్ చిత్రంలో మాళవిక అవినాష్ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. ఎంతో పవర్ ఫుల్ గా కనిపించిన మాళవిక తాజాగా ఆసుపత్రి బెడ్ పై చూస్తుంటే అభిమానులు షాక్ కి గురవుతున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా మాళవిక అవినాష్ ఆసుపత్రిలో చేరారు. 

స్వయంగా ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్న పిక్ షేర్ చేయడంతో మాళవికకి ఏమైంది అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఆమె మైగ్రేన్ సమస్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రి బెడ్ పై పిక్ షేర్ చేయడంతో ఆమె ముఖం గుర్తు పట్టలేని విధంగా మారిపోయి ఉంది. 

ఈ పిక్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని హెచ్చరించారు కూడా. 'ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఏముందిలే తలనొప్పే కదా అని అనుకోవద్దు. అలా అనుకుంటే మీరు నాలాగా ఆసుపత్రి పాలవుతారు అని పోస్ట్ చేశారు. దీనితో ఆమె ఫ్యాన్స్ మాళవిక త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. 

మాళవిక కన్నడ చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా కొనసాగుతున్నారు. ఆమె నటి మాత్రమే కాదు బిజెపి నాయకురాలు కూడా. మాళవిక మైగ్రేన్ సమస్యని అధికమించేందుకు పనాడోల్, నెప్రోసిమ్ తో పాటు.. ఆయుర్వేద ఔషధం కూడా ఆమె తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.