ఫోన్ చేసి బెదిరింపులు..కేజీఎఫ్ నటి మాళవికకి నోటీసులు, వామ్మో ఆధార్ తో ఇలా కూడా చేస్తారా
కెజిఎఫ్ చిత్రంలో మాళవిక అవినాష్ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. తాజాగా మాళవిక అవినాష్ ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది. కొందరిని మాళవిక ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతోంది అనే ఆరోపణలు మొదలయ్యాయి.

ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో కేజీఎఫ్ చిత్రం ఒకటిగా నిలిచింది. రెండు భాగాల్లో ప్రశాంత్ నీల్ ప్రతి పాత్రని ఎంతో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో నటి మాళవిక అవినాష్ జర్నలిస్ట్ పాత్రలో మెరిసింది.
ఈ చిత్రంలో ఆమె కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ.. కథని ముందుకు నడిపే పాత్ర ఆమెది. అందుకే కెజిఎఫ్ చిత్రంలో మాళవిక అవినాష్ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. తాజాగా మాళవిక అవినాష్ ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది.
కొందరిని మాళవిక ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతోంది అనే ఆరోపణలు మొదలయ్యాయి. దీనితో ట్రాయ్ నుంచి మాళవికకి నోటీసులు అందాయి. అయితే మాళవిక ఎవరిని ఎందుకు బెదిరిస్తోంది అనే అనుమాలు కలగొచ్చు. కానీ ఆమె తప్పు ఏమీ లేదు. ఆమె పేరుతో ఉన్న సిమ్ కార్డు నుంచి ఇతరులకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వెళుతున్నాయట. దీనితో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ మాళవిక సిమ్ ని డీయాక్టివేట్ చేసింది. దీనితో మాళవిక ఆశ్చర్యపోయింది.
అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మాళవిక అవినాష్ ఆధార్ కార్డుతో ముంబైలో ఓ అజ్ఞాత వ్యక్తి సిమ్ వాడుతున్నట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తే కొంతమందికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు తేలింది. దీనితో మాళవిక తన ఆధార్ డీటెయిల్స్ ఎలా లీక్ అయ్యాయి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులు ముంబైకి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు. అందుకు నిరాకరించిన మాళవిక వీడియో కాల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రజలంతా తమ ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాళవిక సూచించారు.