ఆరోగ్యం కాస్త కుదుట పడగానే సినిమాల స్పీడ్ పెంచాడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలకు పైనే ఉన్నాయి. సినిమాలోనే కాదు.. జీవితంలో కూడా గెలవాటంటున్నారు సంజయ్, గెలవకపోతే ఎవరూ పట్టించుకోరంటున్నాడు.
బాలీవుడ్ దాదాగా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్ తన పర్‌ఫార్మెన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో తనదైన ఫ్యాన్ బేస్ ను సాధించిన ఈ స్టార్ హీరో క్యాన్సర్ బారిన పడి.. కోలుకున్నారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొని..ఎంతో మంది నటీనటులకు స్ఫూర్తిగా నిలిచాడు. రీసెంట్ గా కెజియఫ్ 2లో అధీరా పాత్రలో మెరిశాడు సంజయ్.
అధీరా పాత్రలో కనిపించి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు. దఈ మూవీతో సంజయ్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు.
అధీరా పాత్రలో తన యాక్టింగ్‌తో అదరగొట్టిన సంజయ్ దత్.. సోషల్ మీడియాలో కూడ ఈ మధ్య ఫుల్ యాక్టీవగా ఉంటున్నాడు. సినిమాతోనే తనకు గౌరవం అంటున్న సంజయ్. ఆ సినిమాతో పాటు జీవితంలో కూడా గెలవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు.
రీసెంట్ గా తన సోషల్ మీడియా పేజ్ లో హ్యాండిల్‌లో ఇంటెన్స్ వర్కవుట్ స్టిల్ నుపోస్ట్ చేసి ఔరా అనిపించాడు సంజయ్. జిమ్‌లో భారీ చైన్లను పైకి లేపుతూ ఉన్న స్టిల్ ను షేర్ చేస్తూ..నువ్వు గెలిచే దాకా నీ కథ గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకే గెలవండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇపుడు ఈ పోస్టు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
కాన్సర్ అని తెలియడంతో తన పని అయిపోతుందనుకుని చాలా బాధపడ్డాడు సంజయ్ దత్. కాని మనో ధైర్యంతో పాటు ప్యామిలీ సపోర్ట్ తో కాన్సర్ ను జయించాడు. ట్రీట్ మెంట్ తరువాత సినిమాల స్పీడ్ పెంచాడు సంజయ్ దత్. కెజియఫ్2 రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న షంషీరా సినిమాలో రణ్ బీర్ కపూర్‌తో కలిసి స్క్రీన్ శేర్ చేసుకుంటున్నాడ సంజయ్. దీంతోపాటు రవీనాటాండన్‌తో ఘూడ్‌చడి చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్న పృథ్విరాజ్ సినిమాలో పృథ్విరాజ్ అంకుల్‌గా అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడు సంజయ్ దత్. తన ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా కమ్ బ్యాక్ అయ్యారు సంజయ్.
