మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కేరళ కోర్డ్  షాక్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో ఆయనకు చుక్కెదురయ్యింది. ఎంతో కాలంగా మోహన్ లాల్ ను వేధిస్తున్న కేసుపై మళ్ళీ మొదటికి వచ్చింది.  

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగారు మోహన్ లాల్. మాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా ఫాలోయింగ్ ను సాధించారు మోహన్ లాల్. హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. ఏమాత్రం ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఇండస్ట్రీని ఏలుతున్నారు మోహన్ లాల్. ఇక ఈక్రమంలో ఆయనకు కేరళలో ఓ కేసు గత కొన్నేళ్లుగా వెంటాడుతుంది. అది ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. 

ఎంతటి సెలబ్రిటీలకైనా ఏదో ఒక ఇబ్బంది తప్పదు. వదిలించుకుందాం అనుకున్నా వదలకుండా వెంటాడే సమస్యలు చాలా ఉంటాయి. కొన్ని చెప్పుకునేవి ఉంటే.. మరికొన్ని చెప్పలేనివి ఉంటాయి. ఇలాంటి సమస్య వెంటాడుతుంది మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను ఏనుగు దంతాలకుసబంధించిన ఓ కేసు ఆయనకు నిద్ర లేకుండా చేస్తుంది. అసలు ఏనుగు దంతాలకు... మోహన్ లాల్ కు సబందం ఏంటీ అని అనుమానం రావచ్చు. మోహన్ లాల్ ఇంట్లో ఓ సందర్భంలో దొరికిన ఏనుగు దంతాలు ఆయను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 

తన ఇంట్లో రెండు ఏనుగు దంతాలను పెట్టుకోవడంతో వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనల ప్రకారం మోహన్ లాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ కేసు విషయంపై మోహన్ లాల్ కోర్టులో వివరణ ఇచ్చారు. ఏనుగు దంతాల కేసు విషయంలో మోహన్ లాల్ కి కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది..ఈ కేసు విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా మరోసారి విచారణ జరిపించాలని కేరళా హైకోర్టు మెజిస్ట్రేట్ ని కోరింది. వివరాల్లోకి వెళితే..


గతంతో మోహాన్ లాల్ ఇంట్లో ఐటీ రైట్స్ జరిగాయి. ఆ సమయంలో ఆయన ఇంట్లో అలంకరణకు వాడిన ఏనుగుదంతాలు చూసిన వారు మోహన్ లాల్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈక్రమంలో మోమన్ లాల్ ఈ దంతాలకు సబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి అని. చట్టప్రకారమే వాటిని తీసుకున్నట్టు తెలిపినా కూడా వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారమే కేసు నమోదు చేసినట్టు సమాధానంవస్తుంది తప్పించి.. ఈకేసు నుంచి మాత్రం ఆయనకు విముక్తి లభించడం లేదు. ఈక్రమంలోనే తాను ఎటువంటి తప్పు చేయలేదని.. పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మోహన్ లాల్ చేసిన పిటీషన్ ని కేరళా హైకోర్టు బుధవారం కొట్టివేసింది.