ఆ విరాళాలు నిజమేనా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 21, Aug 2018, 5:23 PM IST
kerala floods: vijay and sunny leone trolled
Highlights

కేరళ వరద బాధితుల కోసం ప్రముఖులు లక్షల్లో విరాళాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు

కేరళ వరద బాధితుల కోసం ప్రముఖులు లక్షల్లో విరాళాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఎవరెంత సహాయం చేశారనే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరు అభిమానుల అత్యుత్సాహం కారణంగా హీరోలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

తమ అభిమాన హీరో ఇంత విరాళం అందించాడని సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. విజయ్ రూ.14 కోట్ల వ్యవహారం కూడా ఈ కోవకి చెందిందేనని అంటున్నారు. వరద బాధితుల సహాయార్ధం విజయ్ రూ.14కోట్లు విరాళం ఇచ్చినట్లుగా రెండు రోజులగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మాత్రమే ఈ వార్త వినిపిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా ఇది నిజమని రాలేదు.

తమిళ ఇండస్ట్రీ నుండి కూడా ఈ విషయంపై ఎలాంటి ధృవీకరణ లేదు. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని ప్రచారం చేస్తున్నారు. అలానే సన్నీలియోన్ రూ.5 కోట్లు ఇస్తుందని వినిపిస్తోన్న వార్తల్లో కూడా నిజం లేదని టాక్. దీనికి సంబంధించిన ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఆమె పీఆర్ టీమ్ నుండి కూడా ఎటువంటి స్పందన లేదు.   

loader