Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ ధావన్ తో కీర్తి సురేష్ ఆటో రైడ్.. బాలీవుడ్ ఎంట్రీకి మహానటి సిద్ధం.. డిటేయిల్స్!

మహానటి కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి తాజాగా ముంబైలో ఆటో రైడ్ లో కనిపించింది. వీడియో వైరల్ గా మారింది. 
 

Keerthy Suresh Bollywood Entry confirmed? Video Goes Viral with Varun Dhawan NSK
Author
First Published Sep 23, 2023, 4:21 PM IST

నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే హిందీతో తొలిచిత్రానికి సంబంధించిన బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవల ముంబైలోనూ షూటింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)  చివరిగా ‘తోడేలు’ అనే చిత్రంతో అలరించారు. ఆయన నెక్ట్స్ సినిమాను ‘జవాన్’ డైరెక్టర్ అట్లీతో చేస్తున్నారు.  హీరోయిన్ గా కీర్తి సురేష్ కన్ఫమ్ అయ్యింది. ప్రీ పొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. 

రీసెంట్ గానే ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ కలిసి ఆటోలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయ్యింది. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇలా ఆటోలో తిరుగుతూ మీడియా కంట పడ్డారు. కట్ బనియన్ లో వరుణ్ ధావన్, క్యాజువల్ టైట్ ఫిట్ లో కీర్తి సురేష్ ఆటోలో కనిపించారు. ఫొటోలకూ ఫోజులిచ్చారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు VD18పై అషీఫియల్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

బాలీవుడ్ లో వరుణ్ ధావన్ అప్పటికే స్టార్ హీరో కావడం.. కీర్తి సురేష్ జంటగా నటిస్తుండటం.. అట్లీ దర్శకత్వం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా స్టార్ట్ అయిన షెడ్యూల్ 15 రోజుల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదిలో వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘భోళా శంకర్’తో అలరించింది. ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రిటా’, ‘కన్నివెడి’, ‘వీడీ18’లో నటిస్తోంది. చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios