'మహానటి'తో తనేంటో ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె రీసెంట్ గా విజయ్ సరసన సర్కార్ సినిమా చేసింది. దాంతో ఆ ప్రాజెక్టుకు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఫామ్ లో ఉన్న కీర్తి సురేష్ , స్టార్ డైరక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో చేస్తోందనగానే నటనలో మరో మెట్టు ఎక్కుందని అంతా భావించారు. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి.  సినిమాలో కీర్తి సురేష్ ని చూసిన వారు షాక్ అయ్యారు. ఆమె లావుగా కనపడటమే కాక.. నటన కూడా శూన్యం గా కనపడింది.

అసలు సర్కార్ స్క్రిప్టులో అసలు కీర్తి సురేష్ కు స్దానమే కనపడలేదు. కేవలం విజయ్ వెనకాల ..మొదట నుంచీ తిరగటమే తప్ప ఆమె చేసిందేమో లేదు. అప్పుడప్పుడు పాటల్లో డాన్స్ లు వేయటం.. విజయ్ తో మొక్కుబడికి రెండు డైలాగులు చెప్పటమే జరిగింది. అంత దారుణంగా ఆమె పాత్రను డిజైన్ చేసారు. ఇక తన పాత్రలో ఆమె నటించటానికి ఏముంటుంది.

మహానటిలో నిజంగా మహానటి సావిత్రిలా  కనిపించటమే కాక ఎమోషన్స్ ని పలికించి అందరి చేతా శభాష్ అనిపించుకున్న కీర్తి సురేష్ నటించిన సినిమానేనా ఇది అని ఆశ్చర్యపోయేలా ఉంది. అసలు అలాంటి పూర్ స్క్రిప్టుని కీర్తి సురేష్ ఎందుకు ఒప్పుకుందీ అంటే కేవలం విజయ్ సరసన చేయటానికి, మురగదాస్ వంటి స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో కనపించటానికి అని అంటున్నారు.

 రెమ్యునేషన్ పరంగా కూడా ఆమెకు సన్ నెట్ వర్క్ వారు భారీగానే ముట్టచెప్పారని వినిపిస్తోంది. అయితే ఇదే స్లాట్ లో ఉన్న సమంత ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆమె ఎలాంటి పాత్రలో అయినా తనదైన ముద్ర వేయగలుగుతోంది. అంటే మహానటి డైరక్టర్ గొప్పతనం వల్లే ఆ సినిమాలో కీర్తి సురేష్ కు అంత పేరు వచ్చిందా.. ఏమో ఇలాంటి పాత్రలు ఇంకో నాలుగు చేస్తే అందరూ అదే అనుకుంటారు కూడా.