మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ ను పెంచేసుకున్న కీర్తి సురేష్ కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నో కథలకు నో చెప్పిన అమ్మడు ఇప్పుడు మాత్రం స్పీడ్ గా ఒకే చేస్తోంది. మెయిన్ గా సర్కార్ హిట్ అవ్వడంతో బడా దర్శకులు కీర్తిని ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే సెకండ్ హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయని కీర్తి ఇప్పుడు మాజీ ప్రపంచ సుందరితో పోటీకి సిద్ధమైంది. మణిరత్నం తెరకెక్కించబోయే పొన్నియిన్ సెల్వన్ అనే హిస్టారికల్ ఫిల్మ్ లో కీర్తి సురేష్ నటించనుంది. ఇదివరకే మణిరత్నం సినిమా కోసం ఐశ్వర్యారాయ్ ను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. 

ఇక అమితాబ్ బచ్చన్ - విక్రమ్ - కార్తీ - మోహన్ బాబు వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ని మహారాణి పాత్ర కోసం దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ పాత్రకు సమానంగా కీర్తి కనిపిస్తుందట. దీంతో సినిమాపై కోలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం తన స్టార్ డమ్ తో మార్కెట్ ను పెంచుకుంటున్న కీర్తి మాజీ వరల్డ్ బ్యూటీకి ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.