హీరోయిన్లపై ఇష్టం కలగడం సర్వసాధారణమే. సినిమాల్లో వారిని చూసి ఇంప్రెస్‌ అయి ప్రేమలో పడిపోతారు. అందమైన తారల అందాలకు ముగ్డులవుతుంటారు. నటనకు కొందరు పడిపోతే, అందానికి మరికొందరు, వ్యక్తిత్వానికి మరికొందరు పడిపోతుంటారు. కానీ వారి ప్రేమని లోలోపలే దాచుకుంటారు. ఆ ప్రేమని వ్యక్తం చేసే అవకాశంగానీ, సరైన వేదికగా గానీ రాదు. కానీ ఓ వ్యక్తికి మంచి వేదికగా దొరికింది. ఓ పెద్ద స్టార్‌ ముందే తన ప్రేమని వ్యక్తం చేసే అవకాశం దక్కింది. 

హిందీలో `కౌన్‌ బనేగా కరోడ్‌పతి `షో బాగా పాపులర్‌. అమితాబ్‌ బచ్చన్‌ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 12వ సీజన్‌ రన్‌ అవుతుంది. ఇందులో ఇప్పటికే ముగ్గురు మహిళా కంటెస్టెంట్‌లు కోటి రూపాయలు గెలుచుకున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్‌ కి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నాడు. పేదకుటుంబానికి చెందిన విజయ్‌ కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన నెల జీతం ఎనిమిది వేలు. పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనే లక్ష్యంతో కేబీసీలోకి అడుగుపెట్టాడు. 

ప్రస్తుతం విజయ్‌ సింత్‌ రాథోడ్‌ కోటి రూపాయల ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అమితాబ్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో ఆయన తనకు బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ అంటే ఇష్టమని తెలిపాడు. ఆమె సినిమాలన్నీ చూస్తానని, ఆమె ఫోటో ఎప్పుడూ తన వద్దే ఉంటుందని చెప్పాడు. చెప్పడమే కాదు, తన జేబులోనుంచి తీసి చూపించారు. ఆమెపై క్రష్‌ ఉందని, ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో బిగ్‌బీ సైతం షాక్‌ అయ్యాడు. తన ప్రేమని అమితాబ్‌ ముందు, కోట్ల మంది వీక్షించే షోలో చెప్పడం, అలాంటి అవకాశం రావడం నిజంగానే విజయ్‌ అదృష్టమనే చెప్పాలి. మరి దీనిపై కియారా స్పందిస్తుందా? అనేది
చూడాలి.