బెల్లకొండ హీరో .. ఈసారైనా లాభాలను అందిస్తాడా?

First Published 6, Dec 2018, 8:21 PM IST
kavacham pree realese bussines
Highlights

టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోన్న అతి తక్కువ హీరోల్లో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈ కుర్ర హీరో ప్రతి సారి యాక్షన్ కథలతో ప్రేక్షకులను మెప్పించాలని ట్రై చేస్తున్నాడు. 

టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోన్న అతి తక్కువ హీరోల్లో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈ కుర్ర హీరో ప్రతి సారి యాక్షన్ కథలతో ప్రేక్షకులను మెప్పించాలని ట్రై చేస్తున్నాడు. ఇకపోతే మొదటి సారి పోలీస్ సప్సెన్స్ థ్రిల్లర్ కవచం సినిమాతోతో సక్సెస్ కొట్టాలని అనుకుంటున్నాడు. 

రేపు రిలీజ్ కానున్న కవచం సినిమా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతోంది. అయితే షేర్స్ ను ఎంతవరకు అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే బెల్లకొండ హీరో గత రెండు చిత్రాలు పెద్దగా లాభాలను అందించలేకపోయాయి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో భారీ అంచనాల నడుమ రిలీజయింది. 

కానీ ఆ సినిమా 21 కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకోగలిగింది. అదే తరహాలో రిలీజైన సాక్ష్యం కూడా డిజాస్టర్ గా నిలిచింది. 25 కోట్లకు అమ్ముడుపోయిన సాక్ష్యం 12 కోట్ల షేర్స్ ను మాత్రమే రాబట్టగలిగింది. కొన్ని ఏరియాల్లో బయ్యర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో రిలీజవుతున్న కవచం ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.  

loader