కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి భారీ యాక్షన్ సినిమాలతోనే పలకరిస్తున్న బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్ ఈ సారి మరింత స్ట్రాంగ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కవచం సినిమా ద్వారా పోలీస్ పాత్రలో కనిపిస్తూ ఆడియెన్స్ ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడు. కాజల్ ఈ సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. 

ఇక ఫైనల్ గా సినిమా ఈ నెల 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సినిమాకు సంబందించిన సెన్సార్ పనులు కూడా కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఓ వర్గం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. 

శ్రీనివాస్ పోలీస్ క్యారెక్టర్ లో అదరగొట్టేశాడని సెన్సార్ యూనిట్ నుంచి టాక్ వస్తోంది. పోలీస్ అండ్ విలన్ గేమ్ స్క్రీన్ ప్లే ను దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక మరో కథానాయిక మెహ్రీన్ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లుగా సమాచారం. మరి ఫైనల్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.  వంశధార క్రియేషన్స్ పై నవీన్ చౌదరి సినిమాను నిర్మించగా థమన్ సంగీతమందించారు.