ఎదో ఒక విషయంలో పవన్ పేరును ప్రస్తావించే కత్తి మహేష్ మరోసారి డిఫరెంట్ గా కామెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ గురించి చెబుతూ జనసేన పార్టీ గెలుపుపై ఊహించని విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఎదో ఒక విషయంలో పవన్ పేరును ప్రస్తావించే కత్తి మహేష్ మరోసారి డిఫరెంట్ గా కామెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ గురించి చెబుతూ జనసేన పార్టీ గెలుపుపై ఊహించని విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనసేన 3 నుంచి ఏడూ సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

"కాంగ్రెస్ వ్యతిరేకత.రాజకీయ శూన్యత. కమ్మ కుల అధికార దాహం. ఎన్. టి.రామారావు చరిష్మా. ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీపెట్టిన ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ తెలివి శూన్యత. కొణిదెల బ్రదర్స్/ఫ్యామిలీ పై అపనమ్మకం. కాపు కుల అనైక్యత. రాజకీయ సంవృధ్ది(బాబు, జగన్) కలగలిపి పవన్ రాజకీయాలలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా, జనసేన 3 నుంచి 7 సీట్లకు మించి గెలవదు" అంటూ కత్తి మహేష్ పేర్కొన్నాడు. 

దీంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు 7 సీట్లా...? ఎంతైనా నువ్వు పవన్ అభిమానివి బ్రదర్... దాచుకోలేవు" అంటూ మరికొందరు స్పందిస్తుంటే పవన్ ఫ్యాన్స్ మునుపటి లానే కత్తికి కౌంటర్ ఇస్తున్నారు.