సల్మాన్ చొక్కా విప్పితే రాని క్రేజ్ ,ఆమె టవల్ విప్పితే వస్తోందా!?
ఆమె తెరవెనుక ఎంత కష్టపడుతున్నారో చెప్పడానికి ఈ వీడియోలే నిదర్శనం. మరి క్యాట్ కష్టానికి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఏదన్నా సినిమా ప్రమోషన్ లో హీరో ఫలానా విధంగా కష్టపడ్డాడు.. ఫలానా విధంగా ఫైట్స్ చేసాడు..అంటూ విశేషాలను చెప్తూ వీడియోలు వదులుతూంటారు. అయితే టైగర్ 3 కు మాత్రం దర్శక,నిర్మాతలు ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ ఇమేజ్ మీద ఆధారపడుతున్నట్లు లేరు. సినిమాలో వచ్చే టవల్ ఫైట్ ని హైలెట్ చేస్తూ వదులుతున్నారు. తమ సినిమాలో టవల్ ఫైట్ కేక పెట్టిస్తుందని చెప్తున్నారు. ఇది చూసి సల్మాన్ అభిమానులు షాక్ అవుతున్నారు.
వివరాల్లోకి వెలితే....కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ‘టైగర్3’. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif)జంటగా నటిస్తున్న ఈ సినిమాపై మంచిక్రేజే ఉంది. అయితే ఊహించన స్దాయిలో మాత్రం లేదు. దీంతో ఈ సినమాలో హృతిక్ రోషన్ ఉన్నాడు..టవల్ ఫైట్ ఉంది అంటూ ప్రమోషన్స్ యాంగిల్ మార్చారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఇందులోని టవల్ ఫైట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైట్ కోసం కత్రినా ఎంత కష్టపడిందో తెలుపుతూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.
బాలీవుడ్ స్టార్ డైరక్టర్ మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను షురూ చేసింది. ఇందులో భాగంగా కత్రినా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘టైగర్3’లోని యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ‘సినిమా కోసం మనం పడే ప్రతి కష్టం మరో సంచలనానికి దారితీస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. కానీ, వాటన్నింటి కంటే ‘టైగర్3’ ప్రత్యేకమైనది. ఇందులో నా పాత్రను సవాల్‌గా తీసుకున్నా. ప్రతి సన్నివేశం బాగా రావాలని వంద శాతం ప్రయత్నించా. శిక్షణ తీసుకుని ప్రాక్టీస్ చేశాను. నిబద్ధతతో చేసిన పనులు విజయాన్ని సొంతం చేస్తాయని నాకు నమ్మకం ఉంది’ అని రాసుకొచ్చింది.
‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల సక్సెస్ తర్వాత ‘టైగర్ 3’ వస్తుండటంతో జనాలు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ రావాల్సి ఉంది. అందుకోసం కత్రినా కైఫ్ చాలా కష్టపడింది. ‘టైగర్ 3’ సినిమాలో జోయా పాత్ర కోసం కత్రినా కైఫ్ చాలా రోజులుగా కష్టపడింది. హీరోలకు సమానంగా యాక్షన్ సీక్వెన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఆమె తెరవెనుక ఎంత కష్టపడుతున్నారో చెప్పడానికి ఈ వీడియోలే నిదర్శనం. మరి క్యాట్ కష్టానికి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. దీపావళి కానుకగా నవంబర్ 12న ‘టైగర్ 3’ సినిమా విడుదల కానుంది.
‘టైగర్ జిందా హై’కు సీక్వెల్‌గా రానున్న ‘టైగర్3’ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఐదో సినిమాగా ఆదిత్య చోప్రా నిర్మిసున్నారు. ఇందులో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ కీలక పాత్రలో నటించారు. వీళ్ల ముగ్గురి మధ్య భారీ పోరాట ఘట్టాల్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ వచ్చిందనే చెప్పాలి.