సినీ నటుడు, దర్శకుడు, క్రిటిక్స్ కత్తి మహేష్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు తాజాగా వైద్యులు తెలిపారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు.

సినీ నటుడు, దర్శకుడు, క్రిటిక్స్ కత్తి మహేష్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు తాజాగా వైద్యులు తెలిపారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. అయితో ఓ కన్ను పూర్తిగా దెబ్బతిన్నదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కంటిచూపు కూడా కోల్పోలేదని తెలిపారు. రెండు మూడు వారాల్లో పూర్తి ఆరోగ్యంతో బయపడతారని వైద్యులు తెలిపినట్టు కత్తి మహేష్‌ స్నేహితుడు భరద్వాజ వెల్లడించారు. 

కత్తి మహేష్‌ నాలుగు రోజుల క్రితం నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందుగా వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌బెలూన్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయన్ని హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటిక్‌ల్‌గా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు వెల్లడించారు.