కత్తి మహేష్ ఎన్ని వివాదాలను ఎదుర్కొన్న పవన్ విషయాన్నీ మాత్రం మరవడని అందరికి తెలిసిందే. ఎంత మంది రాజకీయ నాయకులూ ఎన్ని పనులు చేసినా.. చేయకున్నా.. కత్తి టార్గెట్ ఎప్పుడు పవర్ స్టార్ పైనే ఉంటుందని జగమెరిగిన సత్యం. ఇకపోతే ఈ మధ్య కత్తి వ్యాఖ్యలు అంతగా వైరల్ కాకపోయినా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూనే ఉన్నారు. 

రీసెంట్ గా పవన్ ఆదాయానికి సంబందించిన కామెంట్ గురించి కత్తి మహేష్ ఫెస్ బుక్ నుంచి ఒక పోస్ట్ వెలువడింది. అది ఇప్పుడు వైరల్ గా మారుతోంది. గత కొన్ని రోజులుగా పవన్ తన పర్యటనలలో జనాలను ఉద్దేశిస్తూ మీ కోసం 100ల కోట్ల ఆదాయాన్ని వదిలేసుకొని వచ్చాను అని వివరణ ఇస్తున్నా సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై కత్తి ఈ విధంగా కామెంట్ చేశాడు. 

"రూ. 100 కోట్ల ఆదాయాన్ని మీకోసం వదులుకున్నా.. ఇక మీరే తేల్చుకోండి": పవన్ కళ్యాణ్  లేని ఆదాయాన్ని.రాని ఆదాయాన్ని ఎట్లా వదులు కుంటావ్ పవన్? ఇప్పటివరకూ నీకొచ్చిన అత్యధిక రెమ్యునరేషన్ అజ్ఞాతవాసికి 25 కోట్లు. అలాంటి సినిమాలు నాలుగు చేస్తేగానీ సంవత్సరానికి వందకోట్లు కావు. 

అదే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం+బిజెపికి నువ్వు చేసిన నాలుగు నెలల ఆర్భాటానికి/ ప్రచారానికి నీకు ఎంత గిట్టుబాటు అయిందో ఖచ్చితంగా తెలిదుగానీ. తప్పకుండా 100 కోట్ల పైనే అని ఒక అంచనా. కాబట్టి సినిమాల్లో ఆదాయం వదులుకుని నువ్వు రాలేదు. రాజకీయాలలో డబ్బు చేసుకోవడానికి నువ్వు వచ్చావు. మీ అన్న అమ్ముకున్న సీట్లు, పార్టీకి నువ్వొక కొనసాగింపు. అంతే! కాబట్టి ఆదాయాలు.త్యాగాల గురించి మాట్లాడకు" అని మహేష్ ఫెస్ బుక్ లో పేర్కొన్నారు.